
ట్రంప్‌కు అభిశంసన, ఉద్వాసన తప్పదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువకాలం వైట్‌హౌస్‌లో కొనసాగబోరని, త్వరలోనే ఆయనకు అభిశంసన ఎదురుకావొచ్చునని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువకాలం వైట్‌హౌస్‌లో కొనసాగబోరని, త్వరలోనే ఆయనకు అభిశంసన ఎదురుకావొచ్చునని డెమొక్రాట్ పార్టీకి చెందిన ఓ నాయకురాలు జోస్యం చెప్పింది. ’అభిశంసనకు సిద్దంగా ఉండు’ అంటూ కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రాట్ నాయకురాలు మాక్జిన్ వాటర్స్ మంగళవారం ట్వీట్ చేసింది.
ట్రంప్ గురించి నేరుగా ఆమె తన ట్వీట్‌లో ఏమీ పేర్కొనకపోయినా.. గతంలోనూ ఆమె పలుసార్లు ట్రంప్ అభిశంసన ప్రతిపాదనను పలుమార్లు తెరపైకి తేవడం గమనార్హం. రష్యాతో, పుతిన్‌తో ట్రంప్‌కు సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఉటంకిస్తూ ఆమె గతంలో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ తాను పాల్పడుతున్న నేరాలకు, తప్పుడు చర్యలకు ఒకరోజు అభిశంసనకు గురికాక తప్పదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మరోసారి అభిశంసనకు సిద్దంగా ఉండు అంటూ ట్రంప్‌ను హెచ్చరించడం గమనార్హం.