షాకింగ్‌ యాక్సిడెంట్‌ | massive accident near Kakani, Guntur district | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ యాక్సిడెంట్‌

Apr 22 2017 6:07 PM | Updated on Oct 30 2018 6:08 PM

షాకింగ్‌ యాక్సిడెంట్‌ - Sakshi

షాకింగ్‌ యాక్సిడెంట్‌

వేగంగా ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, రైల్వే వంతెనపై నుంచి కిందపడిపోయింది.

- డివైడర్‌ను ఢీకొట్టి..వంతెనపై నుంచి కిందపడ్డ కారు
- గుంటూరు జిల్లా కాకానిలో ఘోర ప్రమాదం

కాకాని:
వేగంగా ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, రైల్వే వంతెనపై నుంచి కిందపడిపోయింది. గుంటూరు జిల్లా కాకా సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ముగ్గురు  ప్రాణాలు కోల్పోయారు. వీరు బెంగళూరుకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుగా పోలీసులు గుర్తించారు.

బెంగళూరుకు చెందిన నలుగురి బృందం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఓ వివాహానికి హాజరై, తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు సరిగ్గా బుడంపాడు రైల్వే బ్రిడ్జి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బ్రిడ్జిపై నుంచి 30 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో కారులోని ఒకరు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ ముగ్గిరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా, ఒకరు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


Advertisement
 
Advertisement
Advertisement