breaking news
massive accident
-
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..
కీసర(హైదరాబాద్): కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం చేసుకుని వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది. కీసరలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కీసర ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా మేడిపల్లికి చెందిన యశ్వంత్ (25), పీర్జాదిగూడకు చెందిన చార్లెస్ (25), ఎల్బీనగర్కు చెందిన చెన్నకేశవ గౌడ్ (23), వివేక్, సురేష, యశ్వంత్ నాయక్ శనివారం ఉదయం కారులో కర్ణాటక బీదర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. యశ్వంత్ కారు నడుపుతుండగా, చార్లెస్ ముందు సీట్లో కూర్చున్నాడు. మిగతవారు వెనక సీటులో ఉన్నారు. ఉదయం 11:15 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కీసర ఎగ్జిట్ దాటిన తర్వాత ముందున్న గ్యాస్ కంటెయినర్ లారీని కారు ఢీకొట్టి, డివైడర్‌కు తగిలింది. ఈ ఘటనలో యశ్వంత్‌తో పాటు చార్లెస్ అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నకేశవ గౌడ్ తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో చేర్పించారు. మిగతా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చేర్చించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
షాకింగ్ యాక్సిడెంట్
- డివైడర్‌ను ఢీకొట్టి..వంతెనపై నుంచి కిందపడ్డ కారు - గుంటూరు జిల్లా కాకానిలో ఘోర ప్రమాదం కాకాని: వేగంగా ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, రైల్వే వంతెనపై నుంచి కిందపడిపోయింది. గుంటూరు జిల్లా కాకా సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరు బెంగళూరుకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన నలుగురి బృందం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఓ వివాహానికి హాజరై, తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు సరిగ్గా బుడంపాడు రైల్వే బ్రిడ్జి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బ్రిడ్జిపై నుంచి 30 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో కారులోని ఒకరు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ ముగ్గిరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా, ఒకరు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.