భార్యను హత్య చేసి జీవితాంతం జైలులో.. | Man gets lifer for uxoricide | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసి జీవితాంతం జైలులో..

Sep 16 2015 11:45 AM | Updated on Oct 9 2018 5:39 PM

భార్యను హత్య చేసిన కేసులో ఓ స్థానిక కోర్టు 51 ఏళ్ల వ్యక్తికి జీవిత కారాగార శిక్షను విధించింది.

ఈరోడ్: భార్యను హత్య చేసిన కేసులో ఓ స్థానిక కోర్టు 51 ఏళ్ల వ్యక్తికి జీవిత కారాగార శిక్షను విధించింది. పోలీసుల వివరాల ప్రకారం సమియన్నన్ అనే కార్మికుడు తొలుత తన భార్య పాలనియమ్మాల్ పై అనుమానం పెంచుకున్నాడు. దాంతో తరుచూ భార్యతో గొడవకు దిగేవాడు. 

 

దీంతో ప్రతి రోజు అతడి హింసను భరించలేని ఆమె భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది.  అయితే, 2014 ఏప్రిల్ 20న భార్య వద్దకు వెళ్లిన సమియన్నన్ తనతో రావాల్సిందిగా కోరాడు. అందుకు నిరాకరించకపోవడంతో వెంటనే కత్తితో పలుమార్లు ఆమెను పొడిచి హత్య చేశాడు. దీంతో ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు అతడికి జైలు శిక్షను విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement