లింబో స్కేటింగ్‌లో బాలుడి రికార్డు | Limbo Skating In boy's Devisriprasad record | Sakshi
Sakshi News home page

లింబో స్కేటింగ్‌లో బాలుడి రికార్డు

Aug 27 2015 3:07 AM | Updated on Aug 21 2018 2:34 PM

లింబో స్కేటింగ్‌లో బాలుడి రికార్డు - Sakshi

లింబో స్కేటింగ్‌లో బాలుడి రికార్డు

తిరుపతికి చెందిన దేవిశ్రీప్రసాద్(8) లింబో స్కేటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదు చేసేందుకు ప్రతినిధులకు పంపారు.

తిరుపతి స్పోర్ట్స్: తిరుపతికి చెందిన దేవిశ్రీప్రసాద్(8) లింబో స్కేటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదు చేసేందుకు ప్రతినిధులకు పంపారు. తిరుపతి సిల్వర్ బెల్స్ సెంట్రల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న దేవిశ్రీప్రసాద్ బుధవారం ఫార్వార్డ్ లింబోస్కేటింగ్‌లో 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 17.84 సెకన్లలో చేరుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బ్యాక్‌వార్డ్ (వెనక్కు) లింబోస్కేటింగ్‌లోనూ 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 22.03 సెకన్లలో చేరుకుని గత రికార్డులను తిరగరాశాడు.

మరోవైపు అండర్ బార్స్ ఫార్వార్డ్ (ముందుకు) లోయస్ట్, లాంగెస్ట్ లింబో స్కేటింగ్‌లోనూ రికార్డు సృష్టించాడు. 113 కమ్మీల కింద 8.75 అంగుళాల ఎత్తులో 100.4 మీ. దూరాన్ని 15.4 సెకన్లలో చేరుకుని గిన్నిస్ రికార్డును తిరగరాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement