జార్ఖండ్ లో లాలూ, నితీష్ ప్రచారం | Lalu Prasad, Nitish Kumar to campaign jointly in Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్ లో లాలూ, నితీష్ ప్రచారం

Nov 4 2014 7:40 PM | Updated on Sep 2 2017 3:51 PM

జార్ఖండ్ లో లాలూ, నితీష్ ప్రచారం

జార్ఖండ్ లో లాలూ, నితీష్ ప్రచారం

బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కలిసి జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కలిసి జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇరువురు అగ్రనాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీహార్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ మూడు పార్టీలు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాయని చెప్పారు. నవంబర్-డిసెంబర్ లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

బీహార్ లో 10  అసెంబ్లీ స్థానాలకు ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో లాలూ, నితీష్ కలిసి ప్రచారం చేయగా ఆరు స్థానాలను జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement