కృష్ణా జలాల పిటిషన్లపై సుప్రీం వాయిదా | krishna water dispute petitons adjourned | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల పిటిషన్లపై సుప్రీం వాయిదా

Apr 29 2015 2:09 PM | Updated on Sep 2 2018 5:18 PM

కృష్ణా జల వివాదంపై దాఖలు చేసిన పిటిషన్ల పై వాయిదా పడింది. బుధవారం సుప్రీంకోర్టులో రెండు గంటలపాటు ఈఅంశంపై వాదనలు జరిగాయి.

ఢిల్లీ: కృష్ణా జల వివాదంపై దాఖలు చేసిన పిటిషన్ల పై వాయిదా పడింది. బుధవారం సుప్రీంకోర్టులో రెండు గంటలపాటు ఈఅంశంపై వాదనలు జరిగాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించాలా వద్దా అనే అంశంపై వాదనలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించగా.. ఏపీకి కేటాయింపుల్లో సరైన ప్రాతిపదిక ఏదీ లేదని ఏపీ తరుఫు న్యాయవాది చెప్పారు.

మరోపక్క, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల తరుఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement