హోదా సాధించకుంటే ఎంపీలకు 'ఘన సన్మానం' | K Ramakrishna takes on andhra pradesh mps | Sakshi
Sakshi News home page

హోదా సాధించకుంటే ఎంపీలకు 'ఘన సన్మానం'

Aug 4 2015 12:49 PM | Updated on Aug 13 2018 4:30 PM

హోదా సాధించకుంటే ఎంపీలకు 'ఘన సన్మానం' - Sakshi

హోదా సాధించకుంటే ఎంపీలకు 'ఘన సన్మానం'

ఆగస్టు 10వ తేదీలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యులకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

రాజమండ్రి : ఆగస్టు 10వ తేదీలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యులకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.  మంగళవారం రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రా ఎంపీలు 10వ తేదీలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు.  ఒక వేళ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే వారికి ఘన సన్మానం చేస్తామని వ్యంగ్యంగా అన్నారు.

రాష్ట్రానికి  ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని రామకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 10 తేదీ లోపు ప్రత్యేకహోదా సాధించకుంటే ఈ నెల 11న రాష్ట్ర బంద్‌కు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్‌ఆద్మీపార్టీ, బీసీ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement