'నాకోసం ఎప్పుడూ గుగూల్ లో శోధించలేదు' | I've never googled myself, saysJohnny Depp | Sakshi
Sakshi News home page

'నాకోసం ఎప్పుడూ గుగూల్ లో శోధించలేదు'

Apr 17 2014 3:49 PM | Updated on Sep 2 2017 6:09 AM

'నాకోసం ఎప్పుడూ గుగూల్ లో శోధించలేదు'

'నాకోసం ఎప్పుడూ గుగూల్ లో శోధించలేదు'

హాలీవుడ్ నటుడు జానీ డెప్(50) ఎప్పుడూ తన కోసం గుగూల్ లో శోధించలేదట.

లాస్ ఏంజిల్స్:మనకు ఏమైనా సమాచారం కావాల్సి వస్తే గూగుల్ సెర్చ్ ఇంజన్ ను ఆశ్రయిస్తాం. అలా గూగుల్ లో చర్చించడానికి వారు సెలిబ్రెటీలా?సామాన్యుల అనే తారతమ్యం కూడా ఉండదు. గూగుల్ తల్లికి అందరూ అతిథులే.  ప్రస్తుత ప్రపంచం ఇంటర్ నెట్ తోనే ముడిపడి ఉందనేది కాదనలేని వాస్తవం. నెట్ తో పరిచయం ఎవరైనా గుగూల్ ను అశ్రయిస్తూనే ఉంటారు. అసలు గుగూల్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే కీలక సమాచారాన్నిఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో తెస్తోంది.

 

కాగా, హాలీవుడ్ నటుడు జానీ డెప్(50)  ఎప్పుడూ తన కోసం  గుగూల్ లో శోధించలేదట.  తాను కంప్యూటర్ ను ఉపయోగించినా నెట్ కు దూరంగా ఉంటానన్నాడు. ఈ విషయాన్ని తానే ప్రకటించాడు.  తనకు ఇంటర్ నెట్ తో పరిచయం తక్కువని , అందులో ఎక్కువగా కనిపించే రూమర్స్ ను చూసి  కలత చెందటం ఇష్టం ఉండదన్నాడు.  ఈ క్రమంలోనే గూగుల్ లో తన కోసం ఎప్పుడూ శోధించలేదని జానీ స్పష్టం చేశాడు. కాగా, పిల్లలకు ఎప్పుడూ సాయంగా ఉంటూ వాళ్ల హోం వర్క్ కు తోడ్పడుతుంటానన్నాడు. ఇందులో భాగంగానే కంప్యూటర్ ను ఉపయోగిస్తానని తెలిపాడు. పిల్లలకు ఆసరాగా ఉండేందుకు అతను నటి అంబర్ హార్డ్ ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement