ఆ కార్డుదారులకు ఫ్లిప్ కార్ట్ తక్షణ రీఫండ్ | Instant refunds on Flipkart for Visa debit card users | Sakshi
Sakshi News home page

ఆ కార్డుదారులకు ఫ్లిప్ కార్ట్ తక్షణ రీఫండ్

Mar 30 2017 7:57 PM | Updated on Aug 1 2018 3:40 PM

ఆ కార్డుదారులకు ఫ్లిప్ కార్ట్ తక్షణ రీఫండ్ - Sakshi

ఆ కార్డుదారులకు ఫ్లిప్ కార్ట్ తక్షణ రీఫండ్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇన్ స్టాంట్ రీఫండ్ను ప్రకటించింది.

ముంబై : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్  ఇన్ స్టాంట్ రీఫండ్ సౌకర్యాన్ని ప్రకటించింది. వీసా డెబిట్ కార్డు వాడుతూ కొనుగోలులు చేపట్టే కస్టమర్లకు తక్షణమే రీఫండ్ చేపడతామని  ఫ్లిప్ కార్ట్ గురువారం తెలిపింది. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్ కార్ట్, లీడింగ్ డెబిల్ కార్డు బ్రాండు వీసా కలిసి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు లేని షాపింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చామని తెలిపాయి. ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూట్స్, మర్చంట్స్, స్టార్టప్లు, డెవలపర్లతో కలిసి పనిచేస్తామని, వినూత్న సదుపాయాలతో భారతీయ కస్టమర్లకు ముందుకు వస్తామని ఫ్లిప్ కార్ట్ చెప్పింది.
 
దేశీయ ఈ-కామర్స్ ఇండస్ట్రీకి ఇన్స్టాంట్ రీఫండ్ సొల్యుషన్ అనేది చాలా విభిన్నమైనదని, ఆన్ లైన్ కామర్స్ స్వీకరణ పెంచి వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటామని భారత్, దక్షిణాసియా వీసా గ్రూప్ కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ అన్నారు. వీసా డెబిట్ కార్డులతో ఏమైనా ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే, కంపెనీ వెంటనే వారికి రీఫండ్ సౌకర్యాన్ని కల్పించనుందని తెలిపారు. అంతకముందు ఈ  ప్రక్రియ 2 నుంచి 7 పనిదినాలు పట్టేది. వీసా డెబిట్ కార్డులను ఆఫర్ చేసే బ్యాంకులు.. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టడ్, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, ఫెడరల్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ది సౌత్ ఇండియా బ్యాంకు. ఈ బ్యాంకుల కార్డు హోల్డర్లందరూ ప్రస్తుతం ఈ ఇన్ స్టాంట్ రీఫండ్లను పొందనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement