breaking news
Instant refund
-
ఆ కార్డుదారులకు ఫ్లిప్ కార్ట్ తక్షణ రీఫండ్
ముంబై : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇన్ స్టాంట్ రీఫండ్ సౌకర్యాన్ని ప్రకటించింది. వీసా డెబిట్ కార్డు వాడుతూ కొనుగోలులు చేపట్టే కస్టమర్లకు తక్షణమే రీఫండ్ చేపడతామని ఫ్లిప్ కార్ట్ గురువారం తెలిపింది. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్ కార్ట్, లీడింగ్ డెబిల్ కార్డు బ్రాండు వీసా కలిసి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు లేని షాపింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చామని తెలిపాయి. ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూట్స్, మర్చంట్స్, స్టార్టప్‌లు, డెవలపర్లతో కలిసి పనిచేస్తామని, వినూత్న సదుపాయాలతో భారతీయ కస్టమర్లకు ముందుకు వస్తామని ఫ్లిప్ కార్ట్ చెప్పింది. దేశీయ ఈ-కామర్స్ ఇండస్ట్రీకి ఇన్స్టాంట్ రీఫండ్ సొల్యుషన్ అనేది చాలా విభిన్నమైనదని, ఆన్ లైన్ కామర్స్ స్వీకరణ పెంచి వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొంటామని భారత్, దక్షిణాసియా వీసా గ్రూప్ కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ అన్నారు. వీసా డెబిట్ కార్డులతో ఏమైనా ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే, కంపెనీ వెంటనే వారికి రీఫండ్ సౌకర్యాన్ని కల్పించనుందని తెలిపారు. అంతకముందు ఈ ప్రక్రియ 2 నుంచి 7 పనిదినాలు పట్టేది. వీసా డెబిట్ కార్డులను ఆఫర్ చేసే బ్యాంకులు.. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టడ్, బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, ఫెడరల్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ది సౌత్ ఇండియా బ్యాంకు. ఈ బ్యాంకుల కార్డు హోల్డర్లందరూ ప్రస్తుతం ఈ ఇన్ స్టాంట్ రీఫండ్లను పొందనున్నారు. -
24 గంటల్లో రిఫండ్!
ఫ్లిప్‌కార్ట్ కొత్త పేమెంట్ విధానం న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ‘తక్షణ రిఫండ్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు ఒక ప్రాడక్ట్‌ను వెనక్కు తిరిగిచ్చేసిన తర్వాత, 24 గంటల్లో ఆ ప్రాడక్ట్ డబ్బుల్ని తిరిగి (రిఫండ్) పొందవచ్చు. గతంలో రిఫండ్ ప్రక్రియకు 3-5 పని దినాల సమయం పట్టేది. ఇమీడియట్ పేమెంట్స్ సిస్టమ్స్ ట్రాన్స్ఫర్స్ విధానం ద్వారా ఈ తక్షణ రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఐఎంపీఎస్ చెల్లింపు సౌకర్యం ఉన్న బ్యాంకులకు క్యాష్ ఆన్ డెలివరీ ఐఎంపీఎస్ రిటర్న్ ఫెసిలిటీ అందుబాటులో ఉందని పేర్కొంది.