కక్ష సాధింపు వద్దు: వాద్రా | i moved according to law: vadra | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు వద్దు: వాద్రా

May 16 2015 1:46 AM | Updated on Sep 3 2017 2:06 AM

కక్ష సాధింపు వద్దు: వాద్రా

కక్ష సాధింపు వద్దు: వాద్రా

తన భూములపై విచారణ చేపట్టే పేరిట రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: తన భూములపై విచారణ చేపట్టే పేరిట రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడవద్దని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా వ్యాఖ్యానించారు. తాను గాని, తనవాళ్లుగానీ వాటి విషయంలో దాచిపెట్టేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసిన పలు భూములపై హరియాణా రాష్ట్ర ప్రభుత్వం గురువారం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం రాబర్ట్ వాద్రా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘హరియాణా ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఏం తేలుతుందో వేచి చూ ద్దాం. విచారణను రాజకీయ కక్ష సాధింపు కోసం వినియోగించుకోర ని భావిస్తున్నాను.’ అని అన్నారు.
 కక్ష సాధింపేమీ లేదు
 బీజేపీ ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడబోదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలపై స్పందించిన రాజ్‌నాథ్ తాము అందరికీ కలుపుకొని ముందుకెళతామన్నారు. ఒకవేళ ఈ భూముల అంశంపై హరియాణా ప్రభుత్వం యూపీఏ హయాంలోనే విచారణకు ఆదేశించి ఉంటే కూడా కక్ష సాధింపనే వారా? అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement