‘ఆల్‌ ద బెస్ట్ అథ్లెట్స్‌.. దేశం గర్వపడేలా ఆడండి’ | I convey my best wishes for the Rio games, says PM narendramodi | Sakshi
Sakshi News home page

‘ఆల్‌ ద బెస్ట్ అథ్లెట్స్‌.. దేశం గర్వపడేలా ఆడండి’

Jul 31 2016 9:01 AM | Updated on Aug 15 2018 6:22 PM

‘ఆల్‌ ద బెస్ట్ అథ్లెట్స్‌.. దేశం గర్వపడేలా ఆడండి’ - Sakshi

‘ఆల్‌ ద బెస్ట్ అథ్లెట్స్‌.. దేశం గర్వపడేలా ఆడండి’

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ మైదానంలో ఆదివారం ఉదయం ఆయన ‘రన్‌ ఫర్‌ రియో’ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. 2020 ఒలింపిక్స్‌ క్రీడల నాటికి ప్రతి జిల్లా నుంచి ఒక అథెట్‌ భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించేలా చూస్తామన్నారు. ఈసారి 119 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌కు వెళుతున్నారని, వచ్చే ఏడాది కనీసం 200 మందిని పంపించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం తీసుకున్నదని ఆయన తెలిపారు. ఇంకా మోదీ చేసిన టాప్‌ కామెంట్స్‌ ఇవి..

  • మన అథ్లెట్లు ప్రపంచ ప్రజల హృదయాన్ని గెలిచి రావాలి. భారత్‌ అంటే ఏమిటో ప్రపంచానికి చూపాలి. ఆ విశ్వాసం నాకుంది.
  • ప్రతి క్రీడాకారుడు ఒలింపిక్స్‌ లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలి. ఆటలు అనేవి గెలుపోటముల కోసం కాదు ఉన్నవి. ఆటలు ఉన్నవి మానసిక వికాసం కోసం. ప్రతి వ్యక్తి జీవితంలోనూ క్రీడలు భాగం కావాలి. ప్రతి ఒక్కరి జీవితం వికసించాలి.
  • ప్రతిసారి ఒలింపిక్స్‌ క్రీడలకు రెండు రోజులు  ముందే భారత క్రీడాకారులను పంపేవారు. ఈసారి 15రోజులు ముందు మన క్రీడాబృందాన్ని పంపిస్తున్నాం. దీనివల్ల తగినంత ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుంటుంది.
  • రియోలో మన క్రీడాకారుల భోజన సౌకర్యం కోసం ఈసారి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement