హీరోయిన్‌ బర్త్‌డే స్పెషల్‌ ఫొటోలు! | heroin Birthday Party in Dubai | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ బర్త్‌డే స్పెషల్‌ ఫొటోలు!

Nov 20 2016 6:28 PM | Updated on Sep 4 2017 8:38 PM

హీరోయిన్‌ బర్త్‌డే స్పెషల్‌ ఫొటోలు!

హీరోయిన్‌ బర్త్‌డే స్పెషల్‌ ఫొటోలు!

ప్రముఖ నటి, మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ శనివారం (నవంబర్‌ 19) 41వ వసంతంలో అడుగుపెట్టింది.

ప్రముఖ నటి, మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ శనివారం (నవంబర్‌ 19) 41వ వసంతంలో అడుగుపెట్టింది. దుబాయ్‌లో విహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన పుట్టినరోజు వేడుకలు కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంగా జరుపుకొంది. కూతుళ్లు రీనా, ఆలీషా, తల్లి సుభ్రాతోపాటు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దుబాయ్‌లో కలర్‌ఫుల్‌గా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల ఫొటోలను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేసింది. చాలా క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. నాగార్జున ‘రక్షకుడు’ సినిమాతో తెలుగువారిని కూడా పలుకరించిన సుస్మితా సేన్‌ హిందీలో ‘మై హు నా’ వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తన మరిన్ని పుట్టినరోజు ఫొటోలు ఇక్కడ చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement