డ్రగ్స్‌ గురించి ఇప్పుడు మాట్లాడలేను.. | hero vishal reaction on tollywood drug racket | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ గురించి ఇప్పుడు మాట్లాడలేను..

Jul 19 2017 9:08 PM | Updated on Aug 28 2018 4:32 PM

డ్రగ్స్‌ గురించి ఇప్పుడు మాట్లాడలేను.. - Sakshi

డ్రగ్స్‌ గురించి ఇప్పుడు మాట్లాడలేను..

ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున ఈ కేసుల గురించి ఇప్పుడే మాట్లాడటం సమంజసం కాదని అన్నారు.

- నిందారోపణలు తగవన్న హీరో విశాల్‌
చెన్నై:
గడిచిన వారం రోజులుగా టాలీవుడ్‌ను వణికిస్తోన్న డ్రగ్స్‌ అంశంపై తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్‌ సంఘం కార్యదర్శి, హీరో విశాల్‌ స్పందించారు. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున ఈ కేసుల గురించి ఇప్పుడే మాట్లాడటం సమంజసం కాదని అన్నారు.

అయితే నోటీసులు అందుకున్న వారి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా నిందారోపణలు చేయడం తగదని, అవి వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశాల్‌ అన్నారు. డ్రగ్స్‌ కేసులో విచారణ ముగిసిన వెంటనే ఈ అంశంపై మాట్లాడతానన్నారు. చిన్నపిల్లలు, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల దినచర్యను గమనిస్తుండాలని విశాల్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement