హహ్హహ్హా ...లాఫింగ్ సిక్‌నెస్...! | Hahhahha ... Laughing Sickness ...! | Sakshi
Sakshi News home page

హహ్హహ్హా ...లాఫింగ్ సిక్‌నెస్...!

Oct 19 2015 12:00 PM | Updated on Sep 3 2017 11:10 AM

జంధ్యాల చెప్పినట్లు నవ్వలేకపోవడం తప్పనిసరిగా ఒక రోగం. కానీ అప్రయత్నంగా వికటాట్టహాసం చేయడం లేదా అనియంత్రితంగా...

మెడి క్షనరీ
జంధ్యాల చెప్పినట్లు నవ్వలేకపోవడం తప్పనిసరిగా ఒక రోగం. కానీ అప్రయత్నంగా వికటాట్టహాసం చేయడం లేదా అనియంత్రితంగా ఏడ్వటం కూడా ఒక జబ్బేనట. అయితే, ఇది ఒక ఆదిమ తెగకు మాత్రమే పరిమితం. ‘లాఫింగ్ సిక్‌నెస్’ అని పిలిచే ఈ జబ్బు నరాలపై నియంత్రణ కోల్పోవడం వల్ల వచ్చేది. పపువా న్యూ గినియాలోని ‘ మానవభక్షణ’ చేసే ఆదిమ తెగల్లో పంధొమ్మిది వందల యాభై అరవైలలో ఈ జబ్బు కనిపించేది.

ట్రాన్స్‌మిసిబుల్ స్పంజిఫామ్ ఎన్‌కెఫలోపతి అనే నరాల జబ్బుల వర్గానికి లాఫింగ్ సిక్‌నెస్ చెందుతుందట. ఈ జబ్బును ‘కురు’ అని కూడా పిలిచేవారు. స్వజాతీయుల మెదడును తినే సమయంలో ఆ మెదడుకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇది వస్తుందని డాక్టర్లు కనుగొన్నారు. సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం, మింగడం కష్టం కావడం... ఇవన్నీ లాఫింగ్ సిక్‌నెస్ లక్షణాలు. కురు అంటే వణుకుతుండటం అని స్థానిక భాషలో ఆ పదానికి అర్థం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement