
రయ్ రయ్ మంటూ వచ్చారు.. రన్ రన్‌లో ఉరికారు.. ఉత్సాహం ఉరిమేలా కదిలివచ్చారు.. వ్యాధులను తరిమికొట్టేలా.. అవగాహన కల్పించేలా.. సాగారు. ఆ ప్రాంతంలో ర్యాలీలే ర్యాలీలు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం ఉత్సాహవంతులతో సందడిగా మారింది. జన్యుపరమైన లోపాలతో వచ్చే స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్‌ఎంఏ) వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ–2025’నిర్మించారు.
నేషనల్ టెర్మరిక్ బోర్డు సెక్రెటరీ భవానిశ్రీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 21కే, 10కే, 5కే టైమ్డ్, 5కే నాన్‌టైమ్డ్ విభాగాల్లో రన్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ, ఐఎస్‌బీ, విప్రో సర్కిల్ నుంచి తిరిగి స్టేడియం వరకు రన్‌లు కొనసాగాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులపట్ల ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. క్యూర్ ఎస్‌ఎంఏ సహ వ్యవస్థాపకురాలు శ్రీలక్ష్మీ నలం మాట్లాడుతూ స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ బారిన పడ్డ చిన్నారుల్లో కండర శక్తి, కదలిక సామర్థ్యం ప్రభావితం అవుతుందన్నారు.
దేశంలో ఈ వ్యాధి బారినపడ్డ రోగులకు చేయూతనిచ్చేందుకు కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయం అవసరమన్నారు. కార్యక్రమంలో పీడియాట్రిస్ట్, రెయిబో చి్రల్డన్స్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ రాధా రమాదేవి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, గ్లోబల్ సీఈఓ మయూర్ పటా్నల, తెలంగాణ గ్రూపు సోషల్ ఇంపాక్ట్ డైరెక్టర్ అర్చన సురేష్, సోమిరెడ్డి సత్తి, విజయ్ వావిలాల, సత్య వేమూరి, నైపర్‌డీన్ డాక్టర్ శ్రీనివాస్ నండూరి, డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: అందమైన ముఖాకృతికి ఈ ఫేషియల్ మేలు..!)