భారత ఐటీకి ట్రంప్‌ షాక్‌ | H-1B visa: Shock, cautious optimism in India after Donald Trump’s move | Sakshi
Sakshi News home page

భారత ఐటీకి ట్రంప్‌ షాక్‌

Apr 20 2017 2:02 AM | Updated on Sep 27 2018 4:07 PM

భారత ఐటీకి ట్రంప్‌ షాక్‌ - Sakshi

భారత ఐటీకి ట్రంప్‌ షాక్‌

భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. అమెరికా ప్రథమం అన్న తన ఎన్నికల నినాదానికి అనుగుణంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌–1బీ వీసా నిబంధనలను కఠినతరం చేశారు.

హెచ్‌–1బీ వీసా నిబంధనల మార్పు ఉత్తర్వులపై సంతకం
ఇది సంస్కరణల్లో తొలి అడుగు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌


వాషింగ్టన్‌: భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. అమెరికా ప్రథమం అన్న తన ఎన్నికల నినాదానికి అనుగుణంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌–1బీ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రతినిధుల సభ స్పీకర్‌ పాల్‌ర్యాన్‌ సొంత రాష్ట్రమైన విస్కాన్సిన్‌లోని కినోషాలో ‘అమెరికా ఉత్పత్తులనే కొనం డి.. అమెరికన్‌లకే ఉద్యోగాలు ఇవ్వండి’ అనే నినాదంతో తయారైన వీసా నిబంధనల మార్పుల ఉత్తర్వులపై ట్రంప్‌ మంగళవారం సంతకం చేశారు. విదేశాల నుంచి అత్యున్నత స్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోకి అనుమతించాలని, అధికజీ తం పొందేవారికే హెచ్‌–1బీ వీసాలు ఇవ్వాలని తాజా ఉత్తర్వులు సూచిస్తున్నాయి.

అమెరికన్లతో ఎవరూ పోటీ పడలేరు
‘తీవ్ర దుర్వినియోగమైన వలస విధానం వల్ల అమెరికన్లు నష్టపోయారు. ప్రస్తుత విధానం దీనికి అడ్డుకట్ట వేస్తుంది. తాజా ఉత్తర్వులు విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగుల స్థానంలో అమెరికన్లను కూర్చోబెడతాయి. సరైన అవకాశాలిస్తే అమెరికన్లతో ఎవరూ పోటీ పడలేరు. అయితే దశాబ్దాల తరబడి వారికి అవకాశాలు రాలేదు’అని ఉత్తర్వులపై సంతకం చేసే ముందు ట్రంప్‌ పేర్కొన్నారు. వీసా దుర్వినియోగానికి ముగింపు పలికే ఈ ఉత్తర్వులు తన సంస్కరణల్లో తొలి అడుగుగా అభివర్ణించారు.

అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే..
ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో ‘అమెరికా ఫస్ట్‌’ నినాదాన్ని అమల్లోకి తెచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్‌–1బీ వీసాలు ఇస్తారు. యూఎస్‌ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. 65 వేల వీసాలు జారీ చేయడానికి లాటరీ విధానం కాగా, మరో 20 వేలను గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌ వర్కర్లకు కేటాయించనున్నారు. ఈ లెక్కన అమెరికాలోని ఐటీ కంపెనీలు అక్కడివాళ్లని కాదని విదేశీయులను నియమించుకోలేవు. దీంతో ఎక్కువ నష్టపోయేది భారతీయ ఉద్యోగులే!

భారత ఐటీ కంపెనీలే లక్ష్యం
హెచ్‌–1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్‌ ఉత్తర్వులు మరింత తీవ్రమైన పర్యవేక్షణ, కఠినమైన విధానాలు రాబోతున్నట్టు సూచిస్తున్నాయని భారత ఐటీ పారిశ్రామిక మండలి నాస్కాం వ్యాఖ్యానించింది. భారత ఐటీ కంపెనీలను లక్ష్యంగా చేసుకునే ఈ విధానాలు తీసుకువచ్చారంది. అయితే యూఎస్‌ ఐటీ, కార్పొరేట్‌ సెక్టార్‌ ఈ విధానాలను స్వాగతించాయి. అయితే హెచ్‌–1బీ వీసా గురించి అమెరికా పాలకులతో మాట్లాడనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.   

హెచ్‌1బీ దరఖాస్తుల్లో భారీ తగ్గుదల
హెచ్‌1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది భారీగా తగ్గినట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సుమారు 37 వేల దరఖాస్తులు తగ్గి 1.99 లక్షల దరఖాస్తులు మాత్రమే తమకు అందినట్లు సదరు సంస్థ పేర్కొంది.

రికార్డు స్థాయి విరాళాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రమాణ స్వీకారోత్సవానికి 107 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 692 కోట్లు) విరాళాలు సేకరించి రికార్డు సృష్టించారు. ఇది ఎనిమిదేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు ఒబామా సేకరించిన విరాళాలకు రెట్టింపు కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement