నారాయణ్ సాయి కోసం గుజరాత్ పోలీసుల గాలింపు | Gujarat police raid ashram, no trace of Narayan Sai | Sakshi
Sakshi News home page

నారాయణ్ సాయి కోసం గుజరాత్ పోలీసుల గాలింపు

Oct 18 2013 4:41 PM | Updated on Aug 21 2018 2:29 PM

అత్యాచారం కేసులో అరెస్టయిన వివాదాస్పద మతగురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి కోసం గుజరాత్ పోలీసులు బీహార్లోని దర్భాంగా జిల్లాలో గల ఆశ్రమంపై దాడి చేశారు.

అత్యాచారం కేసులో అరెస్టయిన వివాదాస్పద మతగురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి కోసం గుజరాత్ పోలీసులు బీహార్లోని దర్భాంగా జిల్లాలో గల ఆశ్రమంపై దాడి చేశారు. అతడి అనుచరుడొకరు ఢిల్లీలో దొరికాడు గానీ, నారాయణ్ సాయి మాత్రం ఇంకా దొరకలేదు. ముగ్గురు సభ్యులతో కూడిన గుజరాత్ పోలీసు బృందం బీహార్ పోలీసులతో కలిసి అరియారి గ్రామంలో గల ఆశ్రమంపై దాడి చేసింది గానీ నారాయణ్ సాయి అక్కడ లేరు.

టీనేజి యువతిపై అత్యాచారం చేసిన కేసులో 72 ఏళ్ల ఆశారాం బాపు ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, అతడితో పాటు నారాయణ్ సాయిపై మరో కొత్త కేసు నమోదైంది. సూరత్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై లైంగిక దాడి జరగడంతో వీరిపై కేసు నమోదైంది. అహ్మదాబాద్ ఆశ్రమంలో అక్కపై ఆశారాం బాపు, చెల్లెలిపై సూరత్ ఆశ్రమంలో నారాయణ్ సాయి అత్యాచారం చేశారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement