బీజేపీని ఓడించి తీరుతాం | Grand alliance will defeat BJP-led NDA, say Lalu, Nitish | Sakshi
Sakshi News home page

బీజేపీని ఓడించి తీరుతాం

Aug 12 2015 3:50 PM | Updated on Jul 18 2019 2:11 PM

బీజేపీని ఓడించి తీరుతాం - Sakshi

బీజేపీని ఓడించి తీరుతాం

వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను దెబ్బకొట్టి తీరుతామని, తప్పకుండా ఓడిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అన్నారు.

పాట్నా: వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను దెబ్బకొట్టి తీరుతామని, తప్పకుండా ఓడిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల కూటమి ఎన్డీయేను ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కూటమిలో ఎలాంటి విభేధాలు లేవని వారు స్పష్టం చేశారు.

బుధవారం బీహార్ అసెంబ్లీ సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక మీడియాతో మాట్లాడారు. ఈ నెల గాంధీ మైదాన్లో తమ కూటమి ఆధ్వర్యంలో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామని నితీశ్ కుమార్ చెప్పారు. ఈ ర్యాలీలోనే మా డీఎన్ఏ లో తేడా ఉందని వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి తగిన బదులు ఇస్తామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement