ఆ పేరు మార్చేది లేదు: సిద్ధరామయ్య | Govt is not changing the name of Kempe Gowda Intl Airport, Says Karnataka CM Siddaramaiah | Sakshi
Sakshi News home page

ఆ పేరు మార్చేది లేదు: సిద్ధరామయ్య

Nov 12 2015 2:14 PM | Updated on Sep 3 2017 12:23 PM

ఆ పేరు మార్చేది లేదు: సిద్ధరామయ్య

ఆ పేరు మార్చేది లేదు: సిద్ధరామయ్య

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చేదిలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

బెంగళూరు: కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చేదిలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలన్న వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు.

కాగా ప్రజల మనోభావాలను కర్ణాటక ప్రభుత్వం గౌరవించాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా స్పందించాలన్నారు. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపెగౌడను కర్ణాటక ప్రజలు ఎంతో గౌరవిస్తారని చెప్పారు.

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని తాను చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంపై ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధకరమని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని, దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో కర్ణాటకలో ఘర్షణలు చెలరేగాయి.

Advertisement
 
Advertisement
Advertisement