ఎన్నాళ్లు కుర్చీలో ఉంటానో: సీఎం | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లు కుర్చీలో ఉంటానో: సీఎం

Oct 23 2024 1:32 AM | Updated on Oct 23 2024 10:53 AM

-

ఆరోపణలకు భయపడను: సీఎం

మైసూరు: ఎంతకాలం అధికారంలో ఉంటానో తెలియదు, మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు బీజేపీ, జేడీఎస్‌లను సమర్థంగా ఎదుర్కొంటానని, వారి తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. 

తన బావమరిది చెల్లెలికి పసుపు, కుంకుమగా ఇచ్చిన స్థలాన్ని వివాదంలోకి లాగారని ముడా స్థలాల కేసు గురించి వ్యాఖ్యానించారు. చివరకు స్థలాలను కూడా వాపసు ఇచ్చేశామన్నారు. 40 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా తనకు సొంత ఇల్లు లేదన్నారు. ఇటీవలే మైసూరు కువెంపు రోడ్డులో సొంత ఇంటిని కట్టించుకుంటున్నానన్నారు. తనకు చట్టం ద్వారా న్యాయం లభిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు.

అభ్యర్థుల గురించి..
మాజీ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌తో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక గురించి తాను మాట్లాడలేదని, అయితే పార్టీ సిద్ధాంతాలను మెచ్చి ఎవరొచ్చినా స్వాగతిస్తామని సిద్దరామయ్య అన్నారు. చెన్నపట్టణ సీటును తమ పార్టీ అధ్యక్షులే చూసుకుంటారన్నారు. అభ్యర్థుల జాబితాలో డీకే సురేష్‌ పేరు కూడా ఉంది, వేచి చూద్దాం అన్నారు. సండూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపీ ఈ.తుకారాం భార్యకు టికెట్‌ ఇస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement