Sakshi News home page

'అవే మమ్మల్ని గెలిపిస్తాయి'.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు

Published Sun, Mar 24 2024 7:32 PM

Karnataka CM Siddaramaiah Says About Dynastic Politics - Sakshi

మంత్రుల పిల్లలు, బంధువులకు టిక్కెట్లు ఇవ్వడం వంశపారంపర్య రాజకీయం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓటర్ల సిఫార్సుల అంగీకారం కూడా అభ్యర్థులను ఎంచుకోవడానికి లేదా టికెట్స్ ఇవ్వడానికి కారణం అని ఆయన పేర్కొన్నారు. 

రాబోయే లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండవ జాబితాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున్ ఖర్గే అల్లుడు, ఐదుగురు పిల్లలను కర్ణాటకలో పోటీలో ఉంచుతున్నట్లు తెలిసింది. దీనిపైన సిద్ధరామయ్య మాట్లాడుతూ.. మేము నియోజకవర్గ ప్రజలు సిఫార్సు చేసిన వారికే టిక్కెట్లు ఇచ్చామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం 20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో మొత్తం 28 సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీ మాదిరిగా అబద్ధాలు చెప్పబోనని, అది సాధ్యం కాదని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు హామీలు తప్పకుండా ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయన్న నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది రూ.36,000 కోట్లు ఖర్చు చేశాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.52,900 కోట్లు కేటాయిస్తాం. బీజేపీలా అబద్ధాలు చెప్పడం లేదు అని సిద్ధరామయ్య అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement