షారుక్‌ అభిమానులకు శుభవార్త | Good news for Shah Rukh Khan fans: DD National to air reruns of popular TV show 'Circus' | Sakshi
Sakshi News home page

షారుక్‌ అభిమానులకు శుభవార్త

Feb 13 2017 2:55 PM | Updated on Sep 5 2017 3:37 AM

షారుక్‌ అభిమానులకు శుభవార్త

షారుక్‌ అభిమానులకు శుభవార్త

టీవీ నటుడిగా కరియర్‌ మొదలు పెట్టి బాలీవుడ్‌ లో కింగ్‌ గా వెలుగుతున్నబాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.

ముంబై:  టీవీ  నటుడిగా కరియర్‌ మొదలు పెట్టి బాలీవుడ్‌ లో  కింగ్‌ గా వెలుగుతున్నబాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ అభిమానులకు  గుడ్‌ న్యూస్‌.    షారుక్‌ కరియర్‌కి పునాదులు వేసిన దూరదర్శన్‌ సీరియల్‌  త్వరలో పునః ప్రసారం కానుంది.   1980వ దశకంలో బుల్లితెర  పాపులర్‌  సీరియల్‌ సర్కస్‌ ను మళ్లీ ప్రసారం  చేసేందుకు  దూరదర్శన్‌ నిర్ణయించింది.  అజీజ్‌  మీర్జా, కుందన్‌స షా  దర్శకత్వంలో 1980చివరలో  బహుళ ప్రజాదరణ  పొందిన  షారుఖ్ ఖాన్   నటించిన ‘సర్కస్’ ను దూరదర్శన్ లో ప్రసారం చేయనుంది.  ఫిబ్రవరి 19నుంచి రాత్రి ఎనిమిది గంటలకు డీడీ  నేషనల్‌ లో  టెలీకాస్ట్‌ చేయనుంది.  దీంతో రాయిస్‌  మూవీ సాధించిన విజయంతో సంబరాలు చేసుకుంటున్న  షారూక్‌     ఫ్యాన్స్‌కు ఇది నిజంగా తీపి కబురే.

1988  'ఫౌజీ'  సీరియల్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన కింగ్‌ ఖాన్‌  రెండవ సీరియల్‌ సర్కస్‌ తో  దుమ్ము లేపాడు. ఇక అంతే.. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడలేదు. 1992లో దీవానా చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం  చేసి వరుస విజయాలతో  కింగ్ ఆఫ్ కింగ్స్ , బాలీవుడ్‌ బాద్షాగా అవతరించాడు.  కాగా  రాయీస్‌ పాత్రలో నటించిన తాజా చిత్రం రాయీస్‌ విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement