breaking news
DD National
-
‘దూరదర్శన్‌లో వివాదాల చిత్రం ప్రసారమా?’
తిరువనంతపురం: భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ది కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రసారం చేయాలని డీడీ నేషనల్ నిర్ణయించడమే అందుకు కారణం. పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని దూరదర్శన్ ఛానెల్లో ప్రసారం చేయడం సరికాదని కేరళ సీఎం పినరయి విజయన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా లోక్‌సభ ఎన్నికల వేళ ఈ చర్య మతపరమైన ఉద్రిక్తతలకు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారయన. బీజేపీ, ఆరెస్సెస్‌లకు ప్రచార యంత్రంగా మారొద్దంటూ డీడీ నేషనల్‌కు హితవు పలికారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. The decision by @DDNational to broadcast the film 'Kerala Story', which incites polarisation, is highly condemnable. The national news broadcaster should not become a propaganda machine of the BJP-RSS combine and withdraw from screening a film that only seeks to exacerbate… — Pinarayi Vijayan (@pinarayivijayan) April 4, 2024 ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించేలా దూరదర్శన్ ఏర్పాట్లు చేసుకుంది. మరోవైపు సీపీఐ(ఎం) కూడా డీడీ చర్యను తప్పుబట్టింది. సెక్యులర్ రాష్ట్రంగా ఉన్న కేరళలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ‘‘ఈ సినిమా విడుదల సమయంలో కేరళలో నిరసనలు జరిగాయి. సెన్సార్ బోర్డు సైతం పది సీన్లకు కత్తెర విధించింది. అలాంటి చిత్రాన్ని జాతీయ ఛానెల్లో ప్రదర్శించాలని నిర్ణయించడం ముమ్మాటికీ రెచ్చ గొట్టే చర్య అని ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కిందటి ఏడాది ఈ చిత్రం విడుదలకాగా.. ఆ సమయంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇక ఈ చిత్రాన్ని కేరళ థియేటర్లలో ప్రదర్శించకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అనధికార నిషేధంపై బీజేపీ కోర్టులను ఆశ్రయించింది. ఇక కోర్టు మాత్రం చిత్ర విడుదలను అడ్డుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డు కళ్లు మూసుకుని ఉండదు కదా అని ఆ సమయంలో చిత్ర రిలీజ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. -
‘రామాయణ్’ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ళ తరువాత సైతం, ఇప్పటికీ భారతీయ టెలివిజన్ ప్రపంచాన్ని ఏలుతుంది. రామాయణ్ సీరియల్‌ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి ప్రసారమౌతోన్న ధారావాహిక ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షిస్తోన్న కార్యక్రమంగా రికార్డయినట్టు దూరదర్శన్ ఇండియా ట్విట్టర్లో షేర్ చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ‘రామాయణ్ ను ప్రపంచవ్యాప్తంగా వీక్షించినవారి సంఖ్య అక్షరాలా 7.7 కోట్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసే టీవీ ప్రసారాల రికార్డుని రామాయణ్ బద్దలు కొట్టినట్టయ్యింది. డీడీ నేషనల్ ఛానల్లో మార్చి నుంచి తిరిగి ప్రారంభించిన రామాయణ్ రోజుకి రెండు సార్లు ప్రసారం అవుతోంది. -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ
ప్రపంచమంతా కరోనా కల్లోలం కారణంగా ఇంటి గడపదాటని స్థితి. ప్రధాని పిలుపుతో లాక్డౌన్ వల్ల ప్రజలందరితో పాటు సెలబ్రిటీలు సైతం సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. దూరదర్శన్ ఛానెల్ 32 ఏళ్లకిందట ప్రసారం చేసిన ‘రామాయణ్’ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేస్తోంది. దీంతో పెద్దవాళ్లు, సెలబ్రిటీలు రామాయణాన్ని టీవీలో తిలకిస్తూ తమ బాల్యస్మృతులను నెమరేసుకుంటున్నారు. ‘భారతీయ ఇతిహాసాలు పిల్లలు తెలుసుకోవడానికి ఇది ఓ గొప్ప మార్గం’ అంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సీరియల్ చూస్తూ ఫొటోలు తీసుకొని వాటిని ఆనందంగా షేర్ చేసుకుంటున్నారు. రోజూ 2 ఎపిసోడ్లు రామాయణ్ ధారావాహిక ఈ శనివారం (28–03–2020) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి ఎపిసోడ్‌తో దూరదర్శన్ లో మళ్లీ ప్రారంభమైంది. తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేసింది. ‘ప్రజల డిమాండ్ మేరకు రామాయణం సీరియల్‌ను పునఃప్రసారం’ చేస్తున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం ప్రకటించారు. దీంతో చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి, దూరదర్శన్ ఛానెల్‌కు ‘థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ’ అంటూ ధన్యవాదాలు చెబుతున్నారు. అప్పట్లో ఎక్కడివారక్కడే.. జనవరి 25, 1987లో 30 నిమిషాల నిడివితో 78 ఎపిసోడ్లతో మొదటిసారి దూదర్శన్‌లో రామాయణం ప్రసారమైంది. అప్పట్లో ఇది టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీ సెట్స్ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు సమర్పించేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్‌ని చూసింది. సీరియల్ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ జీవన విలువలనే ధ్యేయంగా విద్యాభ్యాసం చేయించింది. ముప్పై రెండేళ్ల క్రితం ప్రతి ఆదివారం ఉదయం వేళ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించిన రామాయణం ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో మళ్లీ బుల్లితెర మీదకు వచ్చేసింది. రామనవమి వస్తున్న ఈ తరుణంలో రామాయణం మళ్లీ వీక్షించడం మహద్భాగ్యంగా చెప్పుకుంటున్నారు జనం. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం దాకా! ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం..’ పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి. బ్రహ్మాది దేవతలంతా స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా ఉంది. పాప నాశనం చేసి, ధర్మ సంస్థాపన చేయండి అని వేడుకుంటారు దేవతలు. వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చింది చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. ‘సత్యమేవ జయతే’ అంటారు దేవగణం. అక్కడి నుంచి.. రాముడు జననం, విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. డీడీ1లో ప్రసారమవుతున్న ‘రామాయణ్’ సీరియల్ చూస్తూ, సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు నిత్యవిద్యార్థి రామానంద సాగర్ రామానంద సాగర్ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టాడు. రచయితగా ఎన్నో మారు పేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్‌కి అతని కుటుంబ వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్లో పృథ్వీరాజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1950లో సాగర్ ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని నిర్మించాడు. పదుల సంఖ్యలో నామమాత్రపు సినిమాలు అతని ప్రొడక్షన్లో వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం చిన్నతెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని ఒప్పుకున్న సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో అపారప్రతిభను కనబరిచాడని అంతా చెబుతుంటారు. తులసీదాస్ రామాయణమే మూలం రామానంద సాగర్ తులసీదాస్ రామాయణంలోని కథను తన సీరియల్‌కి ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు రాముడి జీవితాన్ని ఇందులో తీసుకున్నారు. రాముడు తిరిగి అయోధ్యను చేరుకోవడం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. చివరలో సీతను రాముడు వదిలేయడం, లవకుశల అంశాలతో కూడిన ఉత్తర రామాయణ్ తీసుకోలేదు. ‘చాలా మంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు ఓ ఇంటర్వూ్యలో రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్‌సాగర్. భారత దేశంలో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్ రూపొందించడానికి రామాయణం ఒక మాధ్యమంగా సాగింది. జీవించిన నటీనటులు రామ పాత్రధారి అరుణ్‌గోవిల్ గళం ఈ సీరియల్‌కే పెద్ద ఎస్సెట్. ప్రశాంత చిత్తం. మృదుమైన మాట. అతను మాట్లాడుతుంటే వినేవారి చెవులు ఆసక్తితో రిక్కించుకుని వింటాయి. ఇక ఇప్పటి వరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్ అని కళ్లు మూసుకొని వెతికినా దీపికా చికాలియా రూపం కళ్లముందు నిలుస్తుంది. కళ్లతో ఆమె పలికించిన భావాలు మనసు నుంచి చెదిరిపోవు. ఇప్పటికి వచ్చిన రామాయణ్ సీరిస్‌లో హనుమాన్ పాత్ర ధారులను గమనిస్తే హనుమాన్‌గా నటించిన ధారా సింగ్ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్ అంటే ధారాసింగ్ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటుగా రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా అరవింద్ త్రివేది కనిపిస్తారు. మరింత అందంగా! మూడు దశాబ్దాల క్రితమే కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సీరియల్ పాత్రదారులకు బ్రైట్ కలర్ కాస్ట్యూమ్స్ వాడారు. మన దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్ టెలివిజన్ చేరవవుతుంది. ఈ చిన్న తెరమీద గులాబీ, నీలం, పసుపు, ఎరుపు రంగులతో షోని బ్లాస్ట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు మనంటి గోడ మీద ఠీవీగా స్థానం సంపాదించుకున్న టీవీలో రామాయణం వర్ణాలన్నీ మరింత క్లారిటీగా వీక్షించవచ్చు. రికార్డులు ఇండియన్ టీవీలో మొట్టమొదటి బ్లాక్ బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షో గా రామాయణం వరల్డ్ లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్ సాగర్ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. – నిర్మలారెడ్డి -
షారుక్ అభిమానులకు శుభవార్త
ముంబై: టీవీ నటుడిగా కరియర్ మొదలు పెట్టి బాలీవుడ్ లో కింగ్ గా వెలుగుతున్నబాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్. షారుక్ కరియర్కి పునాదులు వేసిన దూరదర్శన్ సీరియల్ త్వరలో పునః ప్రసారం కానుంది. 1980వ దశకంలో బుల్లితెర పాపులర్ సీరియల్ సర్కస్ ను మళ్లీ ప్రసారం చేసేందుకు దూరదర్శన్ నిర్ణయించింది. అజీజ్ మీర్జా, కుందన్స షా దర్శకత్వంలో 1980చివరలో బహుళ ప్రజాదరణ పొందిన షారుఖ్ ఖాన్ నటించిన ‘సర్కస్’ ను దూరదర్శన్ లో ప్రసారం చేయనుంది. ఫిబ్రవరి 19నుంచి రాత్రి ఎనిమిది గంటలకు డీడీ నేషనల్ లో టెలీకాస్ట్ చేయనుంది. దీంతో రాయిస్ మూవీ సాధించిన విజయంతో సంబరాలు చేసుకుంటున్న షారూక్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా తీపి కబురే. 1988 'ఫౌజీ' సీరియల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన కింగ్ ఖాన్ రెండవ సీరియల్ సర్కస్ తో దుమ్ము లేపాడు. ఇక అంతే.. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడలేదు. 1992లో దీవానా చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేసి వరుస విజయాలతో కింగ్ ఆఫ్ కింగ్స్ , బాలీవుడ్ బాద్షాగా అవతరించాడు. కాగా రాయీస్ పాత్రలో నటించిన తాజా చిత్రం రాయీస్ విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. Good news for @iamsrk Fans - DON'T MISS @iamsrk's #Circus - Tv Series (1989) - From 19 Feb at 8 pm only on @DDNational pic.twitter.com/SZqEUPKqtn — Doordarshan National (@DDNational) 13 February 2017