రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. అడ్డంవచ్చినవారిపై హతమారుస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. అడ్డంవచ్చినవారిపై హతమారుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాలోని పులివెందల బస్టాండులో ఓ వ్యక్తి నుంచి విలువైన నగదు, బంగారాన్ని దుండగుడు అపహరించాడు. ఆ వ్యక్తి వద్ద దాదాపు ఒక లక్ష రూపాయల నగదుతో పాటు 20 తులాల బంగారం ఉన్నట్టు తెలిసింది.
ఆ విలువైన బంగారం, నగదును ఆ దుండగుడు అపహరించినట్టు తెలుస్తోంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.