breaking news
pulivendula bus stand
-
పులివెందుల బస్టాండ్‌కు అరుదైన గుర్తింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని పులివెందుల బస్టాండ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. పర్యాటకులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బస్టాండ్‌గా అవార్డు దక్కింది. రాజమండ్రిలో నిర్వహించిన పర్యాటక అవార్డుల కార్యక్రమంలో పులివెందుల బస్ టెర్మినల్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.స్టేట్ ఆఫ్ ఆర్ట్ సదుపాయాలతో ఆదర్శవంతమైన బస్టాండ్‌గా దీన్ని నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు, భద్రత, మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని టెర్మినల్‌ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. పర్యాటకుల రాకపోకలకు అనువుగా ఉండటంతో పాటు.. ఆధునిక సదుపాయాలు ఉండటం ఈ గుర్తింపుకు కారణమని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో.. ఆయన సీఎంగా ఉన్నప్పుడే దీనిని నిర్మించడం గమనార్హం.జగన్ హయాంలోనే నిర్మాణంపులివెందుల బస్ టెర్మినల్‌ను రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2022 డిసెంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిని ప్రజలకు అంకితం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌గా దీనిని నిర్మించారు. బస్టాండ్‌లో ఒకేసారి 225 మంది కూర్చునేలా సీటింగ్ సదుపాయం కల్పించారు. మొత్తం 95 బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 13 మరుగుదొడ్లు నిర్మించారు. వికలాంగులు కూడా సులభంగా రాకపోకలు సాగించేలా సదుపాయాలు కల్పించారు.55 సీసీ కెమెరాలతో నిఘాప్రయాణికుల భద్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. బస్టాండ్ పరిసరాల్లో 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 24 గంటల పాటు నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు భద్రత కల్పించేలా టెర్మినల్‌ను రూపొందించారు. పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమంలో పులివెందుల బస్టాండ్‌కు అవార్డు రావడంతో స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ టెర్మినల్‌కు లభించిన గుర్తింపు పులివెందుల ప్రత్యేకతను మరోసారి చాటిందని పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: కాకుమాను కుటుంబానికి పరామర్శ.. ఒంగోలుకు వైఎస్ జగన్ -
చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, వైఎస్ఆర్ కడప: జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పులివెందులలో డా. వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. మిగిలిన బస్టాండ్లకు రోల్‌మోడల్‌గా పులివెందుల బస్టాండ్ తీర్చిదిద్దాం. ఒకవైపు బస్ టెర్మినల్ పనులు కనిపిస్తున్నా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు టెర్మినల్ పనులు జరుగుతున్నా కూడా.. నెగెటివ్ మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి చెడిపోయిన వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ వ్యవస్థలో చంద్రబాబు, టీడీపీతో పాటు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక దత్తపుత్రుడు భాగం అయ్యారు. వీళ్ల తీరు ఎలా ఉందంటే.. చంద్రబాబు తీరు ఎలా ఉందంటే.. ఒక గ్లాస్లో 75 శాతం నీళ్లు ఉన్నా.. అసలు గ్లాసులో నీళ్లు లేవనే ప్రచారం చేస్తున్నారు. గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్. గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది? అని సీఎం జగన్ ప్రతిపక్ష టీడీపీని నిలదీశారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు తక్కువేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. జరిగిన అభివృద్ధి చూస్తే.. పులివెందులలోనే ఉన్నామా? అనిపిస్తోంది. సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి. అవినీతికి తావు లేకుండా సంక్షే పథకాలు అందిస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. పులివెందులలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2023 నాటికి పూర్తవుతుంది. వేంపల్లెలలో రహదారుల విస్తరణకు భూసేకరణ కూడా జరిగింది. వచ్చే రెండేళ్లలో పులివెందులను ఒక నగరంగా మార్చే పరిస్థితికి చేరుకుంటుంది. ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ఆకాంక్షించారు. దేవుడి దీవెనలతో.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేసే అవకాశం తనకు కలగాలని ఆయన కోరుకున్నారు. -
20 తులాల బంగారం, నగదు అపహరణ
వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. అడ్డంవచ్చినవారిపై హతమారుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాలోని పులివెందల బస్టాండులో ఓ వ్యక్తి నుంచి విలువైన నగదు, బంగారాన్ని దుండగుడు అపహరించాడు. ఆ వ్యక్తి వద్ద దాదాపు ఒక లక్ష రూపాయల నగదుతో పాటు 20 తులాల బంగారం ఉన్నట్టు తెలిసింది. ఆ విలువైన బంగారం, నగదును ఆ దుండగుడు అపహరించినట్టు తెలుస్తోంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


