నగ్నంగా ఫోటోలు తీశారని ... | Girls leave hostel after school official takes nude pictures | Sakshi
Sakshi News home page

నగ్నంగా ఫోటోలు తీశారని ...

Feb 12 2015 4:41 PM | Updated on Sep 2 2017 9:12 PM

నగ్నంగా ఫోటోలు తీశారని ...

నగ్నంగా ఫోటోలు తీశారని ...

ప్రభుత్వ హాస్టల్లో రక్షణ ఉంటుంది... బుద్దిగా చదువుకోవచ్చని భావించిన ఆ బాలికలు ఆశలు పేక మేడల్లా కుప్పకూలాయి.

బరంపురం: ప్రభుత్వ హాస్టల్లో రక్షణ ఉంటుంది... బుద్దిగా చదువుకోవచ్చని భావించిన ఆ బాలికల ఆశలు పేక మేడల్లా కుప్పకూలాయి. తమను నగ్నంగా ఫోటోలు తీశారని వార్త తెలుసుకున్న వారు సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. తీవ్ర కలత చెందారు. ఇక్కడ రక్షణ లేదని భావించిన దాదాపు 60 మంది విద్యార్థినులు హాస్టల్ వదిలి గురువారం ఇంటిముఖం పట్టారు. ఈ ఘటన ఒడిశా గంజాం జిల్లా గుడియాలి గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానిక కస్తూరి బా బాలిక విద్యాలయం హాస్టల్లోని ఆరు, ఏడు తరగతి విద్యార్థినులను గతేడాది విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో స్కూల్ గుమాస్తా సదరు విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో ... వారి ఫోటోలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ విషయం స్కూల్ ప్రధాన ప్రిన్సిపల్కు తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ నివేదించారు.  ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

స్కూల్ గుమాస్తాకు హాస్టల్ వంటమనిషి సహకరించినట్లు విచారణలో తెలింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గుమస్తా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్లో మొత్తం 87 మంది విద్యార్థినుల్లో 60 మంది ఇంటికి పయనం కావడంతో  ప్రస్తుతం 27 మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ లో బాలికల రక్షణ కోసం మహిళా కానిస్టేబుల్ ను ప్రభుత్వ ఉన్నతాధికారులు నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement