సహజీవనం తప్పేమీ కాదు: సుప్రీంకోర్టు | Getting into live-in relationship is no crime, says supreme court | Sakshi
Sakshi News home page

సహజీవనం తప్పేమీ కాదు: సుప్రీంకోర్టు

Jul 23 2015 6:33 PM | Updated on Sep 2 2018 5:24 PM

సహజీవనం తప్పేమీ కాదు: సుప్రీంకోర్టు - Sakshi

సహజీవనం తప్పేమీ కాదు: సుప్రీంకోర్టు

మన సమాజంలో ఇప్పుడు సహజీవనం కూడా ఆమోదం పొందిందని, అందువల్ల దాన్ని తప్పుగా చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మన సమాజంలో ఇప్పుడు సహజీవనం కూడా ఆమోదం పొందిందని, అందువల్ల దాన్ని తప్పుగా చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో సహజీవనం అందరికీ ఆమోదయోగ్యం అయ్యిందని, అందువల్ల అది నేరం కాదని తెలిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రజాజీవితంలో ఉన్నవాళ్ల సహజీవనాన్ని బయటపెట్టడం పరువునష్టం కిందకు వస్తుందా అని ప్రభుత్వాన్ని అడిగే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్ల వ్యక్తిగత జీవితంలో ప్రజలు తొంగి చూడకూడదని, అలా చూడటం వల్ల ప్రజా ప్రయోజనం ఏమీ ఉండబోదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement