ఈ-కామర్స్ భవిష్యత్తు అదుర్స్

ఈ-కామర్స్ భవిష్యత్తు అదుర్స్


న్యూఢిల్లీ:  దేశంలో ఈ-కామర్స్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా 30 శాతం చొప్పున ఈ వ్యాపారం వృద్ధిచెందుతోంది. 2014-15 నాటికి ఇది 1,800 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,11,600 కోట్లు) చేరుకునే అవకాశముంది. ఇండియాలో ఈ-కామర్స్ భవిష్యత్తుపై మెక్వైర్ ఈక్విటీస్ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ వివరాలు తెలిపారు.



 ‘పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో ఈ-కామర్స్ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇతర దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఈ-కామర్స్ వాటా 1-3 శాతం ఉండగా, భారత్‌లో ఇది 0.6 శాతమే. అమెరికాలో 64 శాతం, చైనాలో 50 శాతం మంది ఇంటర్నెట్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండగా ఇండియాలో కేవలం 12 శాతం మందే ఆన్‌లైన్ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఈ-కామర్స్ విస్తరణకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...’ అని నివేదిక రూపకర్తలు అతుల్ సోనీ, నితిన్ మొహ్తా తెలిపారు.

 నివేదికలోని ముఖ్యాంశాలు:

     ఇండియాలో మధ్య తరగతి జనాభా 30 కోట్లకు పైనే. ప్రస్తుతం ఈ-కామర్స్ కార్యకలాపాలు త క్కువ స్థాయిలో ఉండడం, ఇంటర్నెట్ సేవలు మ రింతగా అందుబాటులోకి వస్తుండడంతో ఈ-కామర్స్ భవిష్యత్తు అత్యంత ఆశాజనకంగా ఉంది.

     {పస్తుతం దేశంలో ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలు రెండు (ఇన్ఫోఎడ్జ్, జస్ట్‌డయల్) మాత్రమే లిస్టయ్యాయి. లిస్టెడ్ కంపెనీల సంఖ్య పెరిగేకొద్దీ ఈ-కామర్స్ వృద్ధిచెందుతుంది.

     ఆదాయం, లాభాలపరంగా ఒకటి రెండేళ్లలో కొత్త మైలురాళ్లు అందుకుంటామని పలు ఈ-కామర్స్ కంపెనీలు ధీమాగా చెబుతున్నాయి.



     దేశంలో ఈ-కామర్స్ తీరు విభిన్నంగా ఉంటుంది. ఈ వ్యాపారంలో 71 శాతం వాటా ట్రావెల్స్‌దే. వృద్ధి రేటు పరంగా ఈ-టెయిలింగ్ (ఇంటర్నెట్ ద్వారా చేసే రిటైల్ వ్యాపారం) అగ్రస్థానంలో ఉంది. 2009-13 మధ్యకాలంలో ఈ-టెయిలింగ్ ఏకంగా 59 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. తద్వారా త్వరలోనే ఈ-కామర్స్ మార్కెట్లో 16 శాతం వాటాను చేజిక్కించుకోనుంది.దేశీయ యువత షాపింగ్ కోసం మొదటగా ఆన్‌లైన్‌నే ఎంచుకుంటుందని విశ్వసిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top