టోక్యో , ముంబై, పారిస్ అన్నీ .. | From Tokyo to Mumbai To Paris, Markets Are Up After FBI Clears Hillary Clinton | Sakshi
Sakshi News home page

టోక్యో , ముంబై, పారిస్ అన్నీ ..

Nov 7 2016 10:30 PM | Updated on Oct 1 2018 5:16 PM

టోక్యో , ముంబై, పారిస్ అన్నీ .. - Sakshi

టోక్యో , ముంబై, పారిస్ అన్నీ ..

సెన్సెక్స్‌ 185 పాయింట్లు ఎగసి 27,459 వద్ద , నిఫ్టీ కూడా 63 పాయింట్లు జంప్‌చేసి 8,497 వద్ద ముగిసింది. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల వెల్లువ సాగింది

ముంబై : హిల్లరీ క్లింటన్ వర్సెస్ డోనాల్డ్ ట్రంప్  అమెరికా అధ్యక్ష రేసులో ని అనూహ్యమార్పులతో ప్రపంచ మార్కెట్లు కూడా  అనూహ్యంగా స్పందిస్తున్నాయి.  ఎఫ్‌బీఐ  హిల్లరీకి క్లీన్ చిట్తో ప్రపంచవ్యాప్తంగా  మార్కెట్లు తమ ట్రెండ్ మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసియా, యూరప్‌ మార్కెట్లు జోరును  అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు సెషన్ల తర్వాత రీబౌండ్ అయ్యాయి.  ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసాయి. చివరికి సెన్సెక్స్‌ 185 పాయింట్లు ఎగసి 27,459 వద్ద , నిఫ్టీ కూడా 63 పాయింట్లు జంప్‌చేసి 8,497 వద్ద ముగిసింది. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల  వెల్లువ సాగింది. మిడ్ క్యాప్‌  స్మాల్‌ క్యాప్‌ లాభాలతోపాటు ఫార్మా, మెటల్స్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ  తదితర అన్ని రంగాలూ లాభపడ్డాయి.  లుపిన్‌  టాప్ విన్నర్ గా నిలవగా,  అరబిందో, హిందాల్కో, స్టేట్‌బ్యాంక్‌, బీవోబీ, ఐటీసీ, ఐసీఐసీఐ, భెల్‌, టెక్‌ మహీంద్రా, హీరో మోటో  లాభాలతో ముగిశాయి. టీసీఎస్‌, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోయాయి.  పీఎన్బీ  హౌసింగ్ ఫైనాన్స్ 16.5 శాతం  పెరుగుదలతో మార్కెట్ లో ఆకర్షణగా నిలిచింది.

వాల్ స్ట్రీట్ వరుసగా తొమ్మిది సెషన్లలో,  భారతీయ మార్కెట్లలో గత ఐదు సెషన్లలోనూ నష్టాలను ఎదుర్కొన్నాయి.   జపాన్లో, నిక్కి చేరింది 1.6 శాతం, వాల్ స్ట్రీట్ డౌ ఫ్యూచర్స్ లో 1.3 శాతం , యూరోపియన్ మార్కెట్లు దాదాపు 1.5 శాతం పెరగడం విశేషం.ప్రాథమికంగా ఒక సెంటిమెంట్ తో బలపడ్డ మార్కెట్ ట్రెండ్ అని  గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. సౌరభ్ జైన్  వ్యాఖ్యానించారు.

అయితే బంగారం ధరలు మాత్రం వెలవెలబోయాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 330 రూపాయలకు నష్టపోయిన పసిడి 10 గ్రా. రూ. 30,220 వద్ద ఉంది. రూపాయి 0.02 పైసల నష్టంతో 66.73 వద్ద ఉండగా, అటు డాలర్ కూడా బలహీన ట్రెండ్ లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement