విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ | Foreign tourists with e-visa to get free SIM cards containing Rs 50 talk time, 50 Mb data | Sakshi
Sakshi News home page

విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

Feb 16 2017 10:44 PM | Updated on Oct 4 2018 6:57 PM

విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ - Sakshi

విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

న్యూఢిల్లీ : భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ-వీసాతో భారత్ కు వచ్చే విదేశీయులకు ప్రీ-లోడెడ్‍ తో కూడిన ఉచిత సిమ్ కార్డులను అందించనున్నట్టు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ సిమ్ కార్డులో రూ.50 టాక్ టైమ్, 50 ఎంబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అదించనుంది. ఈ సర్వీసులను పర్యాటక శాఖామంత్రి మహేష్ శర్మ లాంచ్ చేశారు.  తొలుత ఈ సర్వీసులు ఢిల్లీలో ఇందిరా గాంధీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అందుబాటులోకి వస్తుండగా.. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 15 అంతర్జాతీయ విమానాశ్రయాలకు అందుబాటులోకి తేనున్నారు.
 
ఈ సిమ్ కార్డు 30 రోజులు వాలిడిటీ ఉంటుంది. 24 గంటల పాటు ప్రయాణికులకు హెల్ప్ లైన్ నెంబర్‍్ను అందుబాటులో ఉంచనుంది. రష్యన్, జర్మన్, జపనీస్ వంటి 12 భాషల్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండనుంది. ఈ-వీసాతో వచ్చే భారత్ కు వచ్చే ప్రయాణికులకు వెల్ కమ్ కిట్ తో పాటు ఉచిత సిమ్ కార్డులను ఇచ్చేందుకు ఎయిర్ పోర్టులో ఇండియన్ టూరిజం డెవలప్‍్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటుచేసింది. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement