'తాగునీటికి మొదటి ప్రాధాన్యం' | first priority to drinking water, says krishna water board | Sakshi
Sakshi News home page

'తాగునీటికి మొదటి ప్రాధాన్యం'

Aug 3 2015 8:00 PM | Updated on Oct 19 2018 7:19 PM

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీరు అడుగండడంతో ఖరీఫ్ సీజన్కు నీరు ఇవ్వలేమని కృష్ణా వాటర్ బోర్డు వర్కింగ్ గ్రూపు నిర్ణయించింది.

హైదరాబాద్: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీరు అడుగండడంతో ఖరీఫ్ సీజన్కు నీరు ఇవ్వలేమని కృష్ణా వాటర్ బోర్డు వర్కింగ్ గ్రూపు తెలియజేసింది. సోమవారం కృష్ణా వాటర్ బోర్డు గ్రూపు సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా ప్రాజెక్టుల కింద సాగునీరు ఇవ్వలేమని బోర్డు తెలియజేసింది. తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నటు తెలిపింది. శ్రీశైలంలోని నీటిని ఎలా వాడుకోవాలన్ని విషయంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కృష్ణా వాటర్ బోర్డు కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement