కబళించిన కరెంట్ తీగ | farmer dies of electric shock | Sakshi
Sakshi News home page

కబళించిన కరెంట్ తీగ

Dec 1 2013 1:08 AM | Updated on Oct 1 2018 2:44 PM

కబళించిన కరెంట్ తీగ - Sakshi

కబళించిన కరెంట్ తీగ

విద్యుదాఘాతానికి ఓ రైతు మృ తి చెందాడు. నిజామాబాద్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన ఒక రైతు ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫీజు పోయిందని ట్రాన్స్‌కో లైన్‌మేన్ చంద్రశేఖర్ అనుమతితో లైన్‌క్లియర్ (ఎల్‌సీ) తీసుకున్నాడు.

నందిపేట, న్యూస్‌లైన్: విద్యుదాఘాతానికి ఓ రైతు మృ తి చెందాడు. నిజామాబాద్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన ఒక రైతు ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫీజు పోయిందని ట్రాన్స్‌కో లైన్‌మేన్ చంద్రశేఖర్ అనుమతితో లైన్‌క్లియర్ (ఎల్‌సీ) తీసుకున్నాడు. కొంతసేపటి తరువాత అదే గ్రామానికి చెందిన భోజన్న తన పొలం వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా ఫీజు పోయిందని ఎల్‌సీ తీసుకున్నాడు. ముందుగా ఎల్‌సీ తీసుకున్న రైతు పని పూర్తిచేసుకుని సరఫరా ఇవ్వాల్సిందిగా ఉపవిద్యుత్ కేంద్రానికి ఫోనులో సమాచారం అందించాడు. అయితే భోజన్న కూడా ఎల్‌సీ తీసుకున్న విషయాన్ని మరిచిన ఆపరేటర్ సరఫరాను పునరుద్ధరించాడు. దీంతో, భోజన్న విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఏడీ కిరణ్‌కుమార్‌పై  దాడి చేశారు. లైన్‌మన్ సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement