అంతా నువ్వే చేశావ్... నాన్నా! | eighty two% of Indian parents involved in deciding child's profession | Sakshi
Sakshi News home page

అంతా నువ్వే చేశావ్... నాన్నా!

Oct 15 2015 7:57 AM | Updated on Sep 2 2018 4:37 PM

అంతా నువ్వే చేశావ్... నాన్నా! - Sakshi

అంతా నువ్వే చేశావ్... నాన్నా!

అంతా నువ్వే చేశావ్... నాన్నా! చిన్నప్పటి నుంచి నేను ఏ డ్రెస్సు వేసుకోవాలో, ఏం చదవాలో, ఏం తినాలో.. నువ్వే నిర్ణయించావు.

న్యూఢిల్లీ: అంతా నువ్వే చేశావ్... నాన్నా! చిన్నప్పటి నుంచి నేను ఏ డ్రెస్సు వేసుకోవాలో, ఏం చదవాలో, ఏం తినాలో.. నువ్వే నిర్ణయించావు. నాకేది ఇష్టమో అడగలేదు... బొమ్మరిల్లు సినిమాలో తండ్రి ప్రకాశ్‌రాజ్‌తో కుమారుడు సిద్ధార్థ్ డైలాగ్ ఇది. భారతీయుల్లో చాలామందికి ఇది అనుభవమే. భారతీయ తల్లిదండ్రుల్లో 82 శాతం మంది తమ పిల్లలు ఏ రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకోవాలో నిర్ణయించేస్తున్నారని లింకెడిన్ సర్వేలో తేలింది. చదువు తర్వాతా పిల్లల కెరీర్‌లో తల్లిదండ్రుల జోక్యం ఉంటోంది.

తల్లిదండ్రులే పిల్లల కెరీర్‌ను నిర్ణయించే ధోరణిలో బ్రెజిల్ ఏకంగా 92 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానం చైనా(87 శాతం)ది. మూడో స్థానంలో భారత్ ఉంది. తమ పిల్లలు రోజూ ఏం చేస్తున్నారో తమకు తెలుసని 84 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 77 శాతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement