ఫోర్బ్స్ టాప్-100 కంపెనీలలో భారతీయ సంతతి హవా | Eight firms headed by Indian-origin entrepreneurs on Forbes' list | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ టాప్-100 కంపెనీలలో భారతీయ సంతతి హవా

Jan 25 2014 1:19 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో భారత సంతతి వ్యక్తులు జయహో అనిపిస్తున్నారు.

న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి వ్యక్తులు  జయహో అనిపిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన 100 అత్యుత్తమ విశ్వసనీయ కంపెనీల్లో భారతీయ సంతతి వ్యక్తులు స్థాపించిన, భారతీయ సంతతి వ్యక్తుల ఆధీనంలో ఉన్న 8 కంపెనీలకు చోటు దక్కింది. ఏడాదికి 25 కోట్ల డాలర్లలోపు ఆదాయాలున్న ఇలాంటి కంపెనీల జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది మూడోసారి.  పిల్లల  కోసం నబి పేరుతో ఆండ్రాయిడ్ ఆధారిత ట్యాబ్లెట్‌లను తయారు చేసే కాలిఫోర్నియాకు చెందిన ఫుహు కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితా వివరాలు....,
 

  • మేరీల్యాండ్ కేంద్రంగా  ఈవెంట్ కార్యకలాపాలు నిర్వహించే వెడ్డింగ్‌వైర్ సంస్థ 27వ స్థానంలో నిలిచింది. దీనిని సోన్నీ గంగూలీ  స్థాపించి నిర్వహిస్తున్నారు.
  • 52వ స్థానంలో వాల్యుయాడెడ్ మొబైల్ సర్వీసులందించే ప్రిపే నేషన్ నిలిచింది. దీనిని అనురాగ్ జైన్, అజయ్ వికాస్ గోయల్ నిర్వహిస్తున్నారు.
  • సోను పండా ఆధ్వర్యంలోని హెచ్ బ్లూమ్ సంస్థ 61వ స్థానంలో ఉంది.
  • నిక్ మెహతా, శ్రీధర్ పెద్దినేనిలు  నిర్వహిస్తున్న ఐటీ సంస్థ గెయిన్‌సైట్ 63వ స్థానంలో నిలిచింది.
  • న్యూయార్క్ కేంద్రంగా సూర్య యలమంచిలి ఆధ్యర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న  పబ్లిక్‌స్టఫ్ 85వ స్థానంలో ఉంది.
  • అనుపమ్ గుప్తా ఆధ్వర్యంలోని మిక్స్‌పో 93వ స్థానంలో నిలిచింది.
  •  పూజన్ కుమార్,  సత్యం వంఘానిల నేతృత్వంలోని పెర్నిక్స్‌డేటా వందవ స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement