breaking news
rocketship growth
-
స్టార్‌షిప్ రిటర్న్స్
కేప్ కెనవెరాల్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్ఎక్స్ సంస్థ మరో ఘనత సాధించింది. 22 గంటల క్రితం నింగివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ మళ్లీ క్షేమంగా భూమిపైకి తిరిగివచ్చింది. ప్రయోగించిన చోటే భారీ యాంత్రిక హస్తాలు శనివారం ఆ రాకెట్‌ను చక్కగా ఒడిసిపట్టుకున్నాయి. పునర్వినియోగ రాకెట్ల తయారీలో ఇదొక గొప్ప ముందడుగుగా నిలిచింది. ఈ నెల 13న టెక్సాస్‌లో తమ లాంచ్‌ప్యాడ్ నుంచి నుంచి స్పేస్ఎక్స్ సంస్థ స్టార్‌షిప్‌ను ప్రయోగించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన 407 అడుగుల(124 మీటర్లు) భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో రెండు ప్రధాన భాగాలున్నాయి. కింది భాగం సూపర్ హెవీ బూస్టర్. పైభాగం స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్. ఈ రెండింటినీ తిరిగి భూమికిపై విజయవంతంగా తీసుకురావాలన్నది ఈ ప్రయోగం లక్ష్యం. కానీ, ప్రయోగించిన కొద్దిసేపటికే సూపర్ హెవీ బూస్టర్ పేలిపోయింది. లాంచ్‌ప్యాడ్ వద్దకు తిరిగి చేరుకోకుండానే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలిపోయింది. స్వాగతించిన ‘నాసా’: స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం 22 గంటలపాటు భూమిచుట్టూ 14సార్లు చక్కర్లు కొట్టింది. అత్యాధునిక స్టార్‌లింక్ ఉప గ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షెడ్యూల్ ప్రకారమే శనివారం భూవాతావరణంలోకి ప్రవేశించింది. గంటకు 27 వేల కిలోమీటర్ల వేగంతో గమ్యం వైపు ప్రయాణించింది. వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ లాంచ్‌ప్యాడ్ వద్దకు చేరుకుంది. నిట్టనిలువుగా కిందికి దిగుతున్న ఆ రాకెట్‌ను లాంచ్ప్యాడ్లో అప్పటికే సిద్ధంగా ఉన్న రెండు యాంత్రిక హస్తాలు భద్రంగా ఒడిసిపట్టుకున్నాయి. బూస్టర్ రికవరీ విఫలమైనప్పటికీ రాకెట్ మాత్రం క్షేమంగా తిరిగిరావడంతో స్పేస్ఎక్స్ సిబ్బంది ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ‘‘ఇది మీరు నమ్మగలరా? ఆ రాకెట్ చూడండి. అద్భుతం.. తిరిగి వచ్చేసింది’’అంటూ స్పేస్ఎక్స్ వ్యాఖ్యాత డాన్ హ్యూట్ బిగ్గరగా అరిచారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన తమ సిబ్బందిని ఎలాన్ మస్క్ అభినందించారు. ఇది 2023 నుంచి పూర్తిస్థాయి స్టార్‌షిప్‌తో స్పేస్ఎక్స్ చేపట్టిన 15వ ప్రయోగం. స్పేస్‌క్రాఫ్ట్‌లోని కీలకమైన హీట్ షీల్డ్‌తో సహా అన్నీ సక్రమంగా పనిచేసినట్లు ‘స్పేస్ఎక్స్’పేర్కొంది. స్పేస్ఎక్స్ సంస్థ గతంలో 3 సార్లు బూస్టర్లను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చింది. రాకెట్‌ను తీసుకురావడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
ఫోర్బ్స్ టాప్-100 కంపెనీలలో భారతీయ సంతతి హవా
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి వ్యక్తులు జయహో అనిపిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన 100 అత్యుత్తమ విశ్వసనీయ కంపెనీల్లో భారతీయ సంతతి వ్యక్తులు స్థాపించిన, భారతీయ సంతతి వ్యక్తుల ఆధీనంలో ఉన్న 8 కంపెనీలకు చోటు దక్కింది. ఏడాదికి 25 కోట్ల డాలర్లలోపు ఆదాయాలున్న ఇలాంటి కంపెనీల జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది మూడోసారి. పిల్లల కోసం నబి పేరుతో ఆండ్రాయిడ్ ఆధారిత ట్యాబ్లెట్లను తయారు చేసే కాలిఫోర్నియాకు చెందిన ఫుహు కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితా వివరాలు...., మేరీల్యాండ్ కేంద్రంగా ఈవెంట్ కార్యకలాపాలు నిర్వహించే వెడ్డింగ్‌వైర్ సంస్థ 27వ స్థానంలో నిలిచింది. దీనిని సోన్నీ గంగూలీ స్థాపించి నిర్వహిస్తున్నారు. 52వ స్థానంలో వాల్యుయాడెడ్ మొబైల్ సర్వీసులందించే ప్రిపే నేషన్ నిలిచింది. దీనిని అనురాగ్ జైన్, అజయ్ వికాస్ గోయల్ నిర్వహిస్తున్నారు. సోను పండా ఆధ్వర్యంలోని హెచ్ బ్లూమ్ సంస్థ 61వ స్థానంలో ఉంది. నిక్ మెహతా, శ్రీధర్ పెద్దినేనిలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ గెయిన్సైట్ 63వ స్థానంలో నిలిచింది. న్యూయార్క్ కేంద్రంగా సూర్య యలమంచిలి ఆధ్యర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పబ్లిక్స్టఫ్ 85వ స్థానంలో ఉంది. అనుపమ్ గుప్తా ఆధ్వర్యంలోని మిక్స్పో 93వ స్థానంలో నిలిచింది. పూజన్ కుమార్, సత్యం వంఘానిల నేతృత్వంలోని పెర్నిక్స్డేటా వందవ స్థానంలో నిలిచింది.


