తాగిన మత్తులో మహిళ చిందులు! | drunk woman throws stock, racially abuses shop staff and blocks customers entering a store | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో మహిళ చిందులు!

Aug 1 2016 8:26 PM | Updated on Aug 11 2018 8:48 PM

తాగిన మత్తులో మహిళ చిందులు! - Sakshi

తాగిన మత్తులో మహిళ చిందులు!

ఓ మహిళ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయింది. తనకు మరింతగా మద్యం ఇవ్వలేదన్న కోపంతో దుకాణంలో వీరంగం వేసింది.

ఓ మహిళ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయింది. తనకు మరింతగా మద్యం ఇవ్వలేదన్న కోపంతో దుకాణంలో వీరంగం వేసింది. దుకాణం సిబ్బందిని నోటికోచ్చినట్టు తిట్టింది. వారిపై జాతివివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన తూర్పు లండన్‌లో జరిగింది. తూర్పు లండన్‌ బెథ్నాల్‌ గ్రీన్‌లోని "ఫ్రెష్‌గో' షాపులో ఓ నల్లజాతి యువతి ఇలా చిందులు తొక్కింది. ఆ షాపులోని వస్తువులను చిందరవందరగా పారేసింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ షాపులోని ఆసియా సంతతి వ్యక్తులపై జాత్యాంహకారపూరితమైన వ్యాఖ్యలు చేసింది. వారిని నానా దుర్భాషలాడింది.

తనకు మరింత మద్యం ఇచ్చేవరకు షాపులోపలికి ఎవరినీ రానీయనంటూ తలుపులు మూసేసి నానా బీభత్సం సృష్టించింది. దీంతో షాపు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలిని గురించి పోలీసులు గాలిస్తున్నారు. నిందితురాలు 20 ఏళ్లకుపైగా వయస్సున్న నల్లజాతి యువతి అని, 5.5 అడుగుల ఎత్తు ఉండి దృఢంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె వీరంగం సృష్టించిన సీసీటీవీ వీడియో దృశ్యాలను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement