'కోపం, భయాల కలబోత ట్రంప్‌ సంతకం' | Sakshi
Sakshi News home page

'కోపం, భయాల కలబోత ట్రంప్‌ సంతకం'

Published Sun, Jan 22 2017 5:31 PM

'కోపం, భయాల కలబోత ట్రంప్‌ సంతకం' - Sakshi

ఇంటర్‌నెట్‌ స్పెషల్‌: అమెరికా అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఓ అధికారిక డాక్యుమెంట్‌పై తొలి సంతకాన్ని చేశారు. అయితే, ట్రంప్‌ సంతకంపై ట్విట్టర్‌లో ట్వీట్ల వరద పారింది. ఎందుకంటే అధ్యక్షుడి సంతకం అచ్చూ ఫ్రీక్వెన్సీ సింబల్‌ను పోలి ఉండటమే. దీంతో ట్రంప్‌ సంతకంపై ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అత్యంత శక్తిమంతమైన సంతకం.. భారీ భూకంపం వస్తే సిస్మోగ్రాఫ్‌లో నమోదయ్యే విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు కొందరు.
 
కాగా, ట్రంప్‌ చేసిన సంతకం ఆటోగ్రాఫ్‌లా ఉందని చేతిరాత నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఆయన సంతకం కోపం, భయాలను సూచిస్తోందని ఓ చానెల్‌ నిర్వహించిన ఇంటర్వూలో పేర్కొన్నారు. 
 
Advertisement
 
Advertisement
 
Advertisement