శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి | Delhi-Chandigarh Shatabdi Express comes under attack | Sakshi
Sakshi News home page

శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

Jul 21 2015 8:28 PM | Updated on Sep 3 2017 5:54 AM

శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

ఢిల్లీ- చండీగఢ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

చండీగఢ్: ఢిల్లీ- చండీగఢ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హర్యానాలోని రతధనా-సోనీపేట రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న రైలుపై రాళ్లతో దాడి జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. దాడిలో రైలు అద్దాలు పగిలిపోయాయన్నారు.

ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైళ్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమీప గ్రామాల్లో అధికారులు ప్రచారం చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement