
పోటీ కోసం పెళ్లి
కేరళలో పంచాయతీ ఎన్నికలు వచ్చేనెల 2, 5 తేదీల్లో జరగనున్నాయి. కొల్లాం జిల్లాలోని నేదవతూరు గ్రామవాసి కె.ఆర్.రాజేష్ సీపీఎం
కేరళలో పంచాయతీ ఎన్నికలు వచ్చేనెల 2, 5 తేదీల్లో జరగనున్నాయి. కొల్లాం జిల్లాలోని నేదవతూరు గ్రామవాసి కె.ఆర్.రాజేష్ సీపీఎం పార్టీలో మాంచి క్రియాశీల కార్యకర్త. రాజకీయాల్లో ఆసక్తి మెండు. నాలుగో వార్డు నుంచి మెంబరుగా పోటీచేయాలని చాన్నాళ్లుగా ఉబలాటపడ్డాడు. తీరా ఎన్నికలు ప్రకటించేసరికి అతని వార్డు ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. రాజేష్ డీలా పడిపోయాడు. అయితే అతని ఉత్సాహాన్ని చూసిన పార్టీ పెద్దలు నిరుత్సాహపడొద్దు అంటూ ఓ ఐడియా ఇచ్చేశారు.
ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకొని నీ భార్యను నిలబెట్టమని సలహా ఇచ్చారు. వెంటనే మనిజా అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసేసుకున్నాడు. ఎన్నికల్లో పోటీకి పెడుతున్నట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. పెళ్లికి ఆరురోజుల ముందే మనిజాతో నామినేషన్ కూడా వేయించేశాడు. చూడాలి... మనోడు లక్కు ఎలా ఉందో. జనం ఏం తీర్పిస్తారో!