మద్యం కంపెనీలకు ఝలక్‌ | cm nithishkumar decision on liquor companies | Sakshi
Sakshi News home page

మద్యం కంపెనీలకు ఝలక్‌

Jan 18 2017 6:13 PM | Updated on Jul 18 2019 2:26 PM

రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి మద్యం ఉత్పత్తి కంపెనీలకు లైసెన్సులను పొడగించబోమని

  • లైసెన్సులు పొడగింపునకు సీఎం నితీశ్‌ నో

  • పట్నా: రాబోయే ఆర్థిక సంవత్సరం (2017-2018) నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా  మద్యం ఉత్పత్తి కంపెనీలకు లైసెన్సులను పొడగించబోమని, కొత్త లైసెన్సులను ఇవ్వబోమని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మద్యపాన నిషేధం క్షేత్ర స్థాయిలో ఏవిధంగా అమలవుతుందో తెలుసుకోవడానికి గత డిసెంబర్‌లో సీఎం నితీశ్‌ ‘నిషాయ్‌ యాత్ర ’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

    బుధవారం చేతన్‌ సభ అనే ప్రాంతంలో ఈ యాత్ర నిర్వహించిన నితీష్‌ మాట్లాడుతూ ‘‘ఎక్సైజ్‌ యాక్ట్‌–2016’’ ప్రకారం 2017 ఏప్రిల్‌1నుంచి రాష్ట్రమంతటా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని తెలిపారు. మద్యం కంపెనీలకూ, బీర్ల కంపెనీలకూ ఇక నుంచి లైసెన్సులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇథనాల్‌ యూనిట్లను మాత్రం కొనసాగిస్తామని,దాని పర్యావరణానికి మేలు జరిగేలా పెట్రోల్‌లో మిశ్రమంలా కలుపుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement