410కి చేరిన చైనా భూకంప మృతుల సంఖ్య | China Earth earthquake toll rises to 410 | Sakshi
Sakshi News home page

410కి చేరిన చైనా భూకంప మృతుల సంఖ్య

Aug 5 2014 2:30 PM | Updated on Sep 2 2017 11:25 AM

చైనాలో సంభవించిన భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య 410కి చేరుకుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు

బీజీంగ్: చైనాలో సంభవించిన భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య 410కి చేరుకుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం చైనాలోని యున్నన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత 6.5 గా నమోదైంది. 
 
గత 14 ఏళ్లలో పెద్ద మొత్తంలో ప్రకంపనలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ ప్రకంపనల్లో సుమారు 80 వేల ఇల్లు నేలమట్టం కాగా, 2 లక్షల 30 వేల మంది నిరాశ్రయులయ్యారు. భూకంప బాధితులకు సహాయం అందించడానికి వేల సంఖ్యలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సైన్యాన్ని ప్రభుత్వం నియమించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement