గ్రూప్లో పోర్న్ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు | Chennai Engineer Arrested for Allegedly Sharing Child Porn Photos on WhatsApp | Sakshi
Sakshi News home page

గ్రూప్లో పోర్న్ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు

Aug 14 2015 2:03 PM | Updated on Aug 20 2018 4:44 PM

గ్రూప్లో పోర్న్ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు - Sakshi

గ్రూప్లో పోర్న్ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు

చెన్నైకు చెందిన ఇంజనీర్ చిన్నపిల్లల అసభ్య చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.

చెన్నై: తమిళనాడులో చెన్నైకి చెందిన ఇంజనీర్ చిన్నపిల్లల అసభ్య చిత్రాలను  సోషల్ మీడియాలో షేర్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలను నిషేధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరుంచి ఓ సెల్ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఒకే కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది వాట్సాప్లో గ్రూప్గా ఏర్పడ్డారు. ఈ క్రమంలో ఓ ఇంజనీర్ కొన్ని అశ్లీల ఫోటోలను, కామెంట్లను పోస్ట్ చేశాడు. దీంతో ఈ గ్రూపులో ఓ సభ్యురాలు అతనిపై గతనెల 29 న ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అతడిని అరెస్టుచేశారు. చిన్న పిల్లలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పోస్కో) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

కాగా ఇది గత రెండునెలల్లో చెన్నైలో నమోదైన మూడో కేసని పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో, సైట్లలో ఇలాంటి ఫొటోలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఉదంతాలను తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement