ప్రియుడు మాట వినలేదని.. కోసిపారేసింది! | Cheating husband's penis gets cut off by mistress | Sakshi
Sakshi News home page

ప్రియుడు మాట వినలేదని.. కోసిపారేసింది!

Sep 17 2015 3:52 PM | Updated on Apr 8 2019 8:11 PM

ప్రియుడు మాట వినలేదని.. కోసిపారేసింది! - Sakshi

ప్రియుడు మాట వినలేదని.. కోసిపారేసింది!

తనతో సరదాగా గడిపే ప్రియుడు తనకు మాత్రమే పరిమితం అవ్వాలని ఆమె అనుకుంది. కానీ, అతడు ఇంట్లో ఇల్లాలితోను, హోటల్లో ప్రియురాలితోను ఇద్దరితో సంబంధాలు నడిపిస్తున్నాడు.

తనతో సరదాగా గడిపే ప్రియుడు తనకు మాత్రమే పరిమితం అవ్వాలని ఆమె అనుకుంది. కానీ, అతడు ఇంట్లో ఇల్లాలితోను, హోటల్లో ప్రియురాలితోను ఇద్దరితో సంబంధాలు నడిపిస్తున్నాడు. ఈ విషయమై ప్రియురాలికి కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా పెళ్లాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉంటావా అంటూ.. ఓ కత్తెర తీసుకుని.. అతడి మర్మాంగాన్ని కోసిపారేసింది. ఈ ఘటన చైనాలో జరిగింది.

లియు (50) అనే ఆ వ్యక్తి ఓ హోటల్ రూం బుక్ చేసుకుని, అక్కడ ఎప్పటిలాగే తన ప్రియురాలితో కలిసి ఉన్నాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు గానీ.. కాసేపటికే ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారని హోటల్ సిబ్బంది చెప్పారు. ఇంకొంచెం సేపు అయిన తర్వాత.. సదరు ప్రియుడు అండర్వేర్ వేసుకునే గగ్గోలు పెడుతూ.. డాక్టర్.. డాక్టర్ అని అరుస్తూ రోడ్డు మీదకు పరుగు లంకించుకున్నాడు. తీరా విషయం ఏంటని చూస్తే, ఆమె కత్తెర తీసుకుని అతడి మర్మాంగాన్ని కట్ చేసేసింది. తాను తన భార్యను వదిలే ప్రసక్తి లేదని అతడు చెప్పడం వల్లే ఇలా జరిగిందని ఆ తర్వాత తెలిసింది. ఇంతపని చేసిన ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement