ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ? | Chand Basha takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ?

Aug 19 2015 1:30 PM | Updated on Jul 28 2018 4:24 PM

ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ? - Sakshi

ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ?

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్బాషా బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్బాషా బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ? అని సర్కార్ను సూటిగా ప్రశ్నించారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని సర్కార్ను నిలదీశారు. తమ పార్టీ శ్రేణుల్ని అరెస్ట్ చేసినా ప్రజలు స్వచ్చంధంగా కడప, నగరిలో బంద్ పాటిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ వారిపై అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని చాంద్బాషా స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement