'నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు' | CEC Brahma takes charge | Sakshi
Sakshi News home page

'నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు'

Jan 16 2015 1:05 PM | Updated on Sep 2 2017 7:46 PM

'నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు'

'నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు'

నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ తెలిపారు.

న్యూఢిల్లీ: నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలోని నిర్వాచన సదన్లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బ్రహ్మ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బ్రహ్మ విలేకర్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితాను పటిష్ట పరిచేందుకు ఏడాదిలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.

బ్రహ్మ ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.  అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న విఎస్ సంపత్ గురువారం పదవి విమరణ చేశారు.

దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్గా హెచ్ ఎస్ బ్రహ్మను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. సంపత్ కూడా 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారే. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి హెచ్ ఎస్ బ్రహ్మ. గతంలో అదే ప్రాంతానికి చెందిన జెఎం లింగ్డో పదవిని చేపట్టిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement