తీవ్ర మార్పులు చేశారో...సీబీడీటీ గట్టి వార్నింగ్! | CBDT warns taxpayers against revising I-T return forms | Sakshi
Sakshi News home page

తీవ్ర మార్పులు చేశారో...సీబీడీటీ గట్టి వార్నింగ్!

Dec 14 2016 2:33 PM | Updated on Mar 28 2019 6:27 PM

తీవ్ర మార్పులు చేశారో...సీబీడీటీ గట్టి వార్నింగ్! - Sakshi

తీవ్ర మార్పులు చేశారో...సీబీడీటీ గట్టి వార్నింగ్!

పన్నుచెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖకు చెందిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ మార్పుల్లో అక్రమాలకుపాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

న్యూఢిల్లీ: పన్నుచెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖకు చెందిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ మార్పుల్లో   అక్రమాలకుపాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  పునశ్చరణ నియమాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన  వారిపై కఠిన చర్యలు తప్పవని  బుధవారం  హెచ్చరించింది.   అక్రమాలను   గుర్తిస్తే దర్యాప్తు చేస్తామని  సీబీడీటీ  ఒక  ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్ లోని నిబంధనను ఉపయోగించుకొని  "విపరీత మార్పులు" చేస్తే జరిమానా, చట్టపరమైన శిక్షలు విధించనున్నట్టు తెలిపింది.
పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ లో భారీ మార్పులు  చేయొద్దని  ఆదేశాలు జారీ చేసింది.   దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్   మార్పులు చేసుకునే అవకాశాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సీబీడీటీ భావిస్తోంది. ఐటిఆర్ లో అవకతవకలకు పాల్పడినవారిపై  విచారణ చేపట్టి జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.   

ఐటీ చట్టం 139)(5)   నిబంధనను  సెక్షన్  ప్రకారం ఐటీ రిటర్న్స్ లో   మార్పులకు చేర్పులకు అవకాశం ఉంది.  క్యాష్ ఇన్ హ్యాండ్,  లాభాలు వగైరాల వివరాలను మార్చుకోవచ్చు. అయితే  సరైన ఆదాయం నిర్ధారించేందుకు  ఆయా కేసులను తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పింది.   అక్రమాలు  చో్టు చేసుకున్నట్టు తేలితే ప్రాసిక్యూషన్,   పెనాల్టీ  అర్హులని  సీబీడీటీ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement