ఢిల్లీలో దారుణం | boy murdered in delhi metro rail | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దారుణం

Sep 18 2015 4:21 PM | Updated on Jul 12 2019 3:29 PM

ఢిల్లీలో దారుణం - Sakshi

ఢిల్లీలో దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మెట్రో రైల్లో సీటు కోసం జరిగిన ఘర్షణ బాలుడి ప్రాణాలు బలిగొంది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మెట్రో రైల్లో సీటు కోసం జరిగిన ఘర్షణ బాలుడి ప్రాణాలు బలిగొంది. సీటు కోసం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు.

విచక్షణ కోల్పోయిన విద్యార్థులు ఇషు(16) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపారు. కింగ్స్ వే క్యాంప్ సమీపంలో జరిగిన ఈ ఘటన మెట్రో రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement