హైస్పీడ్ రైలు కింద చిక్కుకుపోయిన చిన్నారి | boy is trapped under a high-speed train in China | Sakshi
Sakshi News home page

హైస్పీడ్ రైలు కింద చిక్కుకుపోయిన చిన్నారి

Oct 9 2015 7:57 PM | Updated on Jul 12 2019 3:31 PM

హైస్పీడ్ రైలు కింద చిక్కుకుపోయిన చిన్నారి - Sakshi

హైస్పీడ్ రైలు కింద చిక్కుకుపోయిన చిన్నారి

ప్రమాదవశాత్తు ఓ రెండేళ్ల బాలుడు పట్టాల మీద ఆగిన హైస్పీడ్ రైలు, ప్లాట్ఫామ్ మధ్యనున్న చిన్న సందులో పడిపోయాడు.

ప్రమాదవశాత్తు ఓ రెండేళ్ల బాలుడు పట్టాల మీద ఆగిన హైస్పీడ్ రైలు, ప్లాట్ఫామ్ మధ్యనున్న చిన్న సందులో పడిపోయాడు. దాదాపు నాలుగు గంటలపాటు సందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఈ ఘటన ఈశాన్య చైనాలోని చాంగ్చున్లో  ఈ నెల 2న జరిగింది.

హార్బిన్ నుంచి దాలియన్ వెళ్తున్న హైస్పీడ్ రైలు మరమ్మత్తుల కోసం చాంగ్చున్ స్టేషన్ వద్ద ఆగగా.. తల్లిదండ్రులతోపాటు కిందకు దిగిన బాలుడు రైలు ఎక్కే సమయంలో ప్లాట్ఫామ్ మధ్యలో ఉన్న చిన్న సందులో పడిపోయాడు. ఆ ఇరుకైన సందు ఎనిమిది అంచుల వెడల్పు మాత్రమే ఉండటంతో పెద్దవాళ్లు అందులోకి దిగి బాలుడ్ని తీయడం సాధ్యపడలేదు. దీంతో సహాయక బృందాలు శ్రమించి నాలుగు గంటల అనంతరం బాలుడ్ని కాపాడాయి. నాలుగు గంటల అనంతరం చిన్నారి సురక్షితంగా తల్లిదండ్రుల ఒడికి చేరాడు.

Advertisement
 
Advertisement
Advertisement